తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హిట్​ కాంబో ఈజ్​ బ్యాక్​.. ఈ సారి పక్కా యాక్షన్​తో! - విఘ్నేశ్ శివన్​ విజయ్​ సేతుపతి యాక్షన్ సినిమా

విజయ్​ సేతుపతి-విఘ్నేశ్ శివన్​-అనిరూథ్​.. ఈ ముగ్గురి కాంబో కలిస్తే సినిమా ఎలా ఉంటుందో సినీ ప్రియులకు తెలిసిన విషయమే. గతంలో ఈ కాంబోలో వచ్చిన కాతువాకుల రెండు కాదల్‌ తెగ ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడీ కాంబో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఆ వివరాలు..

Vignesh shivan with Vijaysethupati Anirudh action entertainer movie
హిట్​ కాంబో ఈజ్​ బ్యాక్​.. ఈ సారి పక్కా యాక్షన్​తో!

By

Published : Feb 16, 2023, 8:35 PM IST

డిఫరెంట్ కాన్సెప్ట్​ కథలతో తరచూ ఆడియెన్స్​ను అలరిస్తుంటారు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్. అలా అటు కోలీవుడ్​లో ఇటు టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్​ సంపాదించుకున్నారు. గతేడాది విడుదలైన కాతువాకుల రెండు కాదల్‌తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్​టైన్మెంట్​ ఇచ్చారు విఘ్నేశ్​. అనంతరం తన తదుపరి చిత్రాన్ని స్టార్‌ హీరో అజిత్‌తో AK 62 చేస్తున్నట్లు కొంత కాలం క్రితం ప్రకటించి సర్​ప్రైజ్​ ఇచ్చారు. లైకా ప్రొడెక్షన్స్‌ దీనిని నిర్మించేందుకు రెడీ అయింది. అయితే ఆ తర్వాత నిర్మాణ సంస్థ-హీరో-డైరెక్టర్​ మధ్య విభేధాలు రావడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ చిత్రం నుంచి విఘ్నేశ్‌ వైదొలిగారు. ఈ క్రమంలోనే తన ట్విటర్‌ బయో నుంచి AK 62 అనే పేరును తీసేసి ఫ్యాన్స్​కు షాక్ ఇచ్చారు.

అయితే తాజాగా విఘ్నేశ్ శివన్​ ఇప్పుడు తన కొత్త సినిమాపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మళ్లీ విజయ్​ సేతుపతితో కలిసి ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికి విజయ్​ను సంప్రదించారట. చర్చలు జరుగుతున్నాయట. ఈ మూవీ కోసం మ్యూజిక్​ డైరెక్టర్ అనిరూథ్​ను కూడా సంప్రదించారని తెలిసింది. అలా ఈ ముగ్గురు మధ్య డిస్కషన్స్​ జరుగుతున్నాయట. అయితే ఈ సారి రొమాంటిక్​ అండ్ లవ్​ కాకుండా యాక్షన్​ కథలో రానున్నట్లు తెలుస్తోంది. విజయ్​ కూడా నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రియులు సోషల్​మీడియాలో సంబరపడిపోతూ ట్రెండ్​ చేస్తున్నారు.

కాగా, గతంలో ఈ ముగ్గురు కాంబినేషన్​లో వచ్చిన రొమాంటిక్ అండ్ లవ్​.. కాతువాకుల రెండు కాదల్‌ సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. ఇందులో విజయ్ సరసన నయనతార, సమంత హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్​ లవ్​స్టోరీతో వచ్చిన ఈ కథ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సాంగ్స్​ శ్రోతలను తెగ ఉర్రూతలూగించాయి. విజయ్ నటన, అనిరూథ్ మ్యాజిక్​ను ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసిన ఇవే పాటలు వినిపించాయి.

ఇదీ చూడండి:'ప్రాజెక్ట్​ కే'... ఆ రోజు సస్పెన్స్ వీడనుందా?​

ABOUT THE AUTHOR

...view details