ఇటీవలే 'తునివు'తో హిట్‌ను అందుకున్న తమిళ అగ్ర కథానాయకుడు అజిత్.. తన 62వ సినిమాను విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించనున్నారు. అనిరూధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫిబ్రవరి తొలి వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్ వైదొలిగినట్లు సోషల్‌మీడియాలో కొత్త ప్రచారం సాగుతోంది. అందుకు కారణం విఘ్నేశ్ చెప్పిన కథ హీరో అజిత్‌కు, లైకా సంస్థకు సంతృప్తినివ్వలేదని తెలిసింది.
నయనతార భర్తకు షాక్ ఇచ్చిన స్టార్ హీరో! - అజిత్ కుమార్ లేటెస్ట్ న్యూస్
నయనతార భర్త విఘ్నేశ్ శివన్‌కు ఓ విషయంలో స్టార్ హీరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు..
కథలో కొన్ని మార్పులు చేయాలని విఘ్నేశ్‌కు సూచించారట. అయితే అందుకు ఆయన నిరాకరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో హీరోయిన్ నయనతార కూడా రంగంలోకి దిగి ఇరువురి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశారట. కానీ ఫలితం లేకపోయిందని సమాచారం అందుతోంది. దీంతో అజిత్ తన 62వ చిత్రాన్ని మగిళ్ తిరుమేణితో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు మిగామన్, తడం, కలగతలైవన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విజయ్ కోసం తయారు చేసిన కథతోనే అజిత్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్.
ఇదీ చూడండి:సోదరుడి పెళ్లిలో పూజా హెగ్డే హంగామా.. ఎప్పుడూ లేనంత సంతోషంగా..