మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో వేణు తొట్టెంపూడి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టు.. చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను నిజం చేస్తూ.. చిత్ర బృందం బుధవారం.. వేణు లుక్ను పరిచయం చేస్తూ.. ఒక పోస్టర్ను విడుదల చేశారు నిర్మాతలు. సీఐ మురళి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది.
'రామారావు ఆన్ డ్యూటీ'లో వేణు.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా.. - Venu Thottempudi character
రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటుడు వేణు లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో అతను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
'రామారావు ఆన్ డ్యూటీ'లో వేణు.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా..
'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ఆయన శరత్ మండవ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు రవితేజ. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్గా నటించబోతున్నారు. రవితేజ సరసన దివ్యంశ కౌశిక్, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదీ చదవండి:విశ్వక్సేన్ కొత్త సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రణ్బీర్ 'షంషేరా' టీజర్ అదుర్స్