తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పంత్​కు ఊర్వశి 'స్పెషల్' బర్త్​డే విషెస్.. రెడ్ హాట్ లుక్​లో ఫ్లయింగ్ కిస్.. - ఊర్వశి రౌతేలా పంత్​ లవ్ ట్రాక్​

Urvashi Rautela Rishabh Pant : ఈ జంట తీరు వేరు. ఒకసారి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటారు. ఇంకోసారి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. మారోసారి సారీ చెప్పి తియ్యగా మాట్లాడుకుంటారు. కానీ ఎప్పుడూ సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా ఉంటారు. వాళ్ల పర్సనల్​, ప్రోఫెషనల్​ జీవితానికి అదనంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు. ఎంతైనా సెలబ్రెటీల వరసే వేరు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? ఇది చదవండి మరి..

urvashi rautela rishabh pant
urvashi rautela rishabh pant

By

Published : Oct 4, 2022, 4:03 PM IST

Urvashi Rautela Rishabh Pant : ఒకరు వెండితెర ముద్దుగుమ్మ, మరొకరు క్రికెట్​ సోగ్గాడు. ఒకరు మోడల్​గా తన అందచందాలు ప్రదర్శిస్తుంటే.. మరొకరు గ్రౌండ్​లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు. సోషల్​ మీడియాలో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ సోషల్ మీడియా సినిమాకు నాయకానాయికలు ఊర్వశి రౌతేలా, రిషభ్ పంత్. కొన్నాళ్లుగా వీరి లవ్​ ట్రాక్​.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్న తీరుగా సాగుతోంది. తాజాగా ఈ జంట మళ్లీ నెట్టింట్లో హాట్​ టాపిక్ అయ్యింది.

తాజాగా ఊర్వశి.. ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్​ చేసింది. అందులో యాపిల్​ పండు రంగు డ్రెస్సులో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతూ ఓ ఫ్లైయింగ్​ కిస్​ ఇచ్చింది. ఆ వీడియో కింద 'హ్యాపీ బర్త్​డే' అని రాసి.. ఒక ఎర్ర బెలూన్​ ఇమోజీ ఉంచింది. దానికింద 19 స్టార్ గుర్తులు పెట్టింది. కానీ ఈ విషెస్ ఎవరికో మాత్రం చెప్పలేదు. అయితే ఈ అమ్మడు అక్కడే దొరికిపోయింది. ఎలా అంటే.. ఈ రోజు టీమ్ ఇండియా వికెట్ కీపర్ పంత్​ పుట్టిన రోజు.

అయితే ఆమె పోస్ట్​లో చేసిన 19 స్టార్లకు కామెంట్​ సెక్షన్​లో సమాధానం ఇస్తున్నారు అభిమానులు. ఆ 19 స్టార్లకు అర్థం.. ఆర్​పీ17 అని చెబుతున్నారు. అంటే 17 రిషభ్ పంత్​ జెర్సీ నెంబర్​ కాబట్టి దాని అర్థం అదే అని అంటున్నారు ఫ్యాన్స్​. పంత్​కే పరోక్షంగా బర్త్​డే విషెస్ చెప్పిందని కామెంట్ చేస్తున్నారు. మరి.. ఈ నాటకీయ పరిణామాల మధ్య వీరిద్దరి కథ కంచికి ఎప్పుడు చేరుతుందో వేచిచూడాలి.

కొంతకాలం నుంచి టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​తో మాటల యుద్ధానికి దిగిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. దీంతో సోషల్​మీడియాలో విపరీతంగా ట్రోలింగ్​కు గురైంది. అయితే రిలేషన్​షిప్​లో ఉన్న వీరిద్దరూ విడిపోయారని అందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు పంత్​పై సైటైర్లు వేసిన రౌతేలా.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. "ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ సారీ చెప్పాలనుకుంటున్నాను. క్షమించండి" అంటూ చేతులు కట్టుకుని చెప్పింది. దీంతో ఊర్వశి.. రిషభ్​కు క్షమాపణలు చెప్పినట్లు కథనాలు వచ్చాయి.

ఇవీ చదవండి:చీరకట్టులో శోభిత, మాళవిక అందాలకు ఫిదా అవ్వాల్సిందే!

దీపావళి రేసు నుంచి రవితేజ 'ధమాకా' ఔట్.. శ్రీనువైట్లతో గోపీచంద్ కొత్త మూవీ!

ABOUT THE AUTHOR

...view details