తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Upcoming Telugu Movies : మెగాస్టార్ X సూపర్​స్టార్​.. ఈ వారం కొత్త సినిమాల రిలీజ్​ లిస్ట్​ ఇదే! - ఉస్తాద్​ తేదీ రిలీజ్​ డేట్​

Upcoming Telugu Movies August : బాక్సాఫీస్​ వద్ద గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్రహీరోల సినిమాలు.. రిలీజ్​కు సిద్ధమయ్యాయి. వీటితోపాటు ఓటీటీలో పలు చిత్రాలు రానున్నాయి. మరి ఆ మూవీలేంటి? వాటి పూర్తి వివరాలు మీకోసం.

Upcoming Telugu Movies
Upcoming Telugu Movies

By

Published : Aug 7, 2023, 10:56 AM IST

Upcoming Telugu Movies August : ప్రేక్షకులంతా ప్రతి వారం.. కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ వారం.. ప్రేక్షకుల ముందుకు మూడు కొత్త సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు పెద్ద సినిమాలు కాగా.. మరొకటి చిన్న సినిమా రిలీజ్​ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు శ్రీసింహ కోడూరి నటించిన చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాత రజనీని చూడబోతున్నామా?
Jailer Movie Release Date :సూపర్​ స్టార్​ రజనీకాంత్​ కథానాయకుడిగా.. నెల్సన్​ దిలీప్​ కుమార్​ రూపొందించిన చిత్రం జైలర్​. తమన్నా కథానాయికగా నటించగా.. ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది. ఇందులో రజనీకాంత్‌ స్టైల్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చూస్తుంటే పాత రజనీని గుర్తు చేస్తున్నాయి. మరి జైలర్‌ కథేంటో తెలియాంటే సినిమా చూడాల్సిందే!

భోళాజీ.. రెడీ!
BholaShankar Movie Release Date : ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్​ చిరంజీవి.. ఇప్పుడు భోళాశంకర్​గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ మూవీని మెహర్​ రమేశ్​ తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్​గా నటించగా.. కీర్తి సురేశ్​, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు.

ఆకాశ ప్రయాణానికి ఉస్తాద్​!
Ustaad Movie Release Date:ఆస్కార్​ మ్యూజిక్ డైరెక్టర్​ కీరవాణి తనయుడు​ శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ఉస్తాద్‌. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మించారు. కావ్యా కల్యాణ్‌రామ్‌ కథానాయిక. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీసింహా మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు.

సన్నీ దేవోల్​ X అక్షయ్​ కుమార్​
Bollywood New Movies : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గదర్‌ 2. ఇందులో ఆయన తారా సింగ్‌ పాత్రలో నటిస్తున్నారు. సకీనాగా అమీషా పటేల్‌ నటిస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.

అక్షయ్‌కుమార్‌ దేవుడి పాత్రలో నటించిన ఓ మై గాడ్‌ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఓ మై గాడ్‌ 2 రూపొందింది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

OTT New Movies :ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • గబ్బీస్‌ డాల్‌ హౌస్‌ (మూవీ)- ఆగస్టు 07
  • జాంబీవెర్స్‌ (కొరియన్‌)- ఆగస్టు 08
  • హార్ట్‌ ఆఫ్ స్టోన్‌ (మూవీ)- ఆగస్టు 11
  • ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ)- ఆగస్టు 11
  • పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ)- ఆగస్టు 11

జీ5

  • ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌)- ఆగస్టు 11
  • అబర్‌ ప్రోలీ (బెంగాలీ)- ఆగస్టు 11

సోనీలివ్‌

  • ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌)- ఆగస్టు 9
  • పొర్‌ తొళిల్ (తమిళ్‌/తెలుగు)- ఆగస్టు 11
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో- మేడ్‌ ఇన్‌ హెవెన్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 10
  • ఆహా- హిడింబ (తెలుగు) ఆగస్టు 10

ABOUT THE AUTHOR

...view details