తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్​' సెట్​లో రణ్​బీర్​, రష్మిక - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్ - Unstoppable show with animal movie team

Unstoppable With NBK Season 3 Ranbir Kapoor : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. 'అన్​స్టాపబుల్' షోతో అలరించడానికి మళ్లీ బుల్లితెరపైకి రానున్నారు. ఈ షో సీజన్ 3కు సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్​ స్ట్రీమింగ్ డేట్​ను ఓటీటీ సంస్థ ఆహా ప్రకటించింది.

Unstoppable With NBK Season 3 Ranbir Kapoor
Unstoppable With NBK Season 3 Ranbir Kapoor

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 3:29 PM IST

Updated : Nov 16, 2023, 4:01 PM IST

Unstoppable With NBK Season 3 Ranbir Kapoor :నందమూరి బాలకృష్ణ 'అన్​స్టాపబుల్' షో సీజన్​ -3తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు సీజన్లలో టాలీవుడ్​కు పరిమితమైన ఈ టాకింగ్ షో.. ఇప్పుడు బాలీవుడ్ దాకా వెళ్లింది. ఈ సీజన్​ తొలి ఎపిసోడ్​కు బాలీవుడ్​ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్ అండ్ 'యానిమల్' మూవీటీమ్ వచ్చినట్టు, ఓటీటీ సంస్థ 'ఆహా' ఇప్పటికే తెలిపింది. అయితే తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్​.. స్ట్రీమింగ్​ కానున్న తేదీని అధికారికంగా ప్రకటించింది 'ఆహా'.

ఈ బిగ్గెస్ట్​ ఎపిసోడ్​ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ట్విట్టర్​ వేదికగా తెలిపింది. 'డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్​లోనే వైల్డెస్ట్ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి ప్రసారం కానుంది' అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్​లో హీరో రణ్​బీర్​తోపాటు హీరోయిన్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్​ ప్రోమో వచ్చినప్పటి నుంచి.. బాలీవుడ్ హీరోతో బాలయ్య ఏం మాట్లాడారు? వీరిద్దరి మధ్య సంభాషణలు ఎలా సాగాయి? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అంటూ ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ ఎపిసోడ్​కు హైప్ క్రియేట్ అయ్యింది.

Animal Movie Release Date: రణ్​బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్​ రోల్​లో నటించిన సినిమా 'యానిమల్'. ఈ సినిమాకు 'అర్జున్​ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటుడు సన్నీ దేఓల్, త్రిప్తి దిమ్రి, పరిణితి చోప్రా, అనిల్ కపూర్, శరత్ సక్సెనా తదితరులు నటించారు. ఇటీవల మూవీటీమ్ సినిమా ప్రమోషన్​లు కూడా ప్రారంభించింది. అందులో భాగంగానే రణ్​బీర్ అండ్ మూవీటీమ్.. అన్​స్టాపబుల్​ షోకు గెస్ట్​లుగా వచ్చారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ.. ట్రైలర్​ సినీప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా.. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్​గా విడుదల కానుంది.

Unstoppable Season 3 : అన్​స్టాపబుల్​లో 'భగవంత్ కేసరి' మూవీటీమ్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్​గా శ్రీలీల, కాజల్

Balakrishna Unstoppable 3 : ఓవైపు భగవంత్​ కేసరి.. మరోవైపు అన్​స్టాపబుల్​-3.. బాలయ్య ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్​!

Last Updated : Nov 16, 2023, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details