Unstoppable With NBK Season 3 Ranbir Kapoor :నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమయ్యే 'అన్‌స్టాపబుల్' షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సారి అన్‌స్టాపబుల్ రేంజ్ బౌండరీలు దాటి బాలీవుడ్ దాకా వెళ్లింది. అందులో భాగంగా ఈ షోకు గెస్ట్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో బాలయ్య, రణ్‌బీర్ దిగిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రణ్‌బీర్‌తో బాలయ్య ఏం మాట్లాడారు? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Animal Movie Release Date :రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'యానిమల్'. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణ్‌బీర్ అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు. రణ్‌బీర్‌తో పాటు రష్మిక, దర్శకుడు సందీప్ వంగా కూడా ఈ షోలో పాల్గొన్నారు. డిసెంబర్లో 'యానిమల్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ.. టీజర్, పాటలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.