నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్ -2'. తాజాగా ఈ షోలో అలనాటి తారలు జయప్రద, జయసుధ, యువనటి రాశీఖన్నా సందడి చేశారు. బాలయ్యతో సరదాగా డ్యాన్స్‌లు చేసి.. తమ కెరీర్, తోటి నటీనటులు, సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఊహలు గుసగుసలాడే' నుంచి 'ఏం సందేహం లేదు' పాట పాడి రాశీఖన్నా ప్రేక్షకుల్ని అలరించారు.
ఆ హీరోయిన్ నేను హాట్ పెయిర్: యంగ్ బ్యూటీపై బాలయ్య కామెంట్స్ - రాశీ ఖన్నాపై బాలకృష్ణ కామెంట్స్
ఓ హీరోయిన్‌పై కామెంట్స్ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తాను ఆమె హాట్ పెయిర్ అని చెప్పారు. ఆ సంగతులు..
ఆ హీరోయిన్ నేను హాట్ పెయిర్: యంగ్ బ్యూటీపై బాలయ్య కామెంట్స్
అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. 'నేనూ శ్రుతి ప్రస్తుతం హాట్ పెయిర్' అని నవ్వులు పూయించారు. రాశీఖన్నా నవ్వుకు ఫ్లాటైపోతున్నానని అన్నారు. 'హీరోయిన్ కావాలంటే కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. ఇది నిజమా? కాదా?' అని బాలయ్య ప్రశ్నించగా.. 'అవును' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నటీమణులు.
ఇదీ చూడండి:RRR ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోకి ఎంట్రీ