Tollywood Tier 2 Heroes Movie Bussiness : చిత్రపరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి పెరిగిపోయింది. గత రెండు మూడేళ్ల క్రితం వరకు ఓ సినిమా రూ.100 బిజినెస్ చేసిందంటే అదో గొప్ప విషయం. ఒకట్రెండు స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే ఇది సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడలా లేదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక.. టైర్ 2 హీరోలు కూడా తమ సినిమాలతో దాదాపుగా రూ.100 కోట్లకు చేరువగా బిజినెస్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రతీ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా చిత్రాలు పలు భాషల్లో డబ్బింగ్ అవుతున్నాయి. దీంతో ఓ సినిమమా ఓవరాల్ బిజినెస్ భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ డీల్స్ జరుగుతున్నాయి.
ఈ మధ్యే.. విజయ్ దేవరకొండ-సమంత ఖుషి సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర బిజినెస్ భారీగానే జరిగిందని అన్నారు! నాని సినిమాలు కూడా ఇతర భాషల్లో రిలీజ్ అవుతూ పర్వాలేదనిపించే వసూళ్లను నమోదు చేస్తున్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకే విక్రయాలు జరుగుతున్నాయి. దసరాతో ఆయన మార్కెట్ పరిధి పెరిగింది. దీంతో ఆయన కొత్త సినిమా హాయ్ నాన్న నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ రేటుకు అయిందని తెలిసింది. రూ.100కోట్ల వరకు వచ్చే అవకాశముందనే టాక్ కూడా వినిపిస్తోంది.