Tiger Nageswara Rao Trailer :మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాను డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అయితే మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. మాస్ డైలాగ్స్‌తో పాటు రవితేజ లుక్స్‌తో ఈ ట్రైలర్ ఆద్యంతం కొత్తగా కనిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.
స్టువర్టుపురంలో టైగర్ నాగేశ్వర రావు ఎలా ఉండేవారు. ఆయన ఏ విధంగా నడుచుకునేవారు అన్న విషయాల గురించి ట్రైలర్లో చూపించారు. రెండున్నర నిమిషాల నిడివి గల ఆ గ్లింప్స్‌లో నాగేశ్వర రావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. ఇక రవితేజ ఓ వైపు యంగ్ అండ్ డైనమిక్ రోల్లో కనిపిస్తూనే.. మరోవైపు అత్యంత క్రూరమైన వ్యక్తిగానూ భయపెట్టారు. మొత్తానికి మాస్ మహారాజ రేంజ్ ఆ పాత్రకు న్యాయం చేశారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tiger Nageswara Rao Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. ది కశ్మిర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన సొంత బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుకృతి వాస్ అనుపమ్ ఖేర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూరుస్తున్నారు.