Tiger 3 Movie 3 Days Collections :బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టైగర్ 3'. దీపావళి కానుకగా ఈ సినిమా ఈనెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముఖ్యంగా సినిమాలో సల్లూభాయ్ యాక్షన్ సీన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మౌత్ అడ్వర్టైజ్మెంట్తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఫలితంగా దీని ప్రభావం సినిమా వసూళ్లపై పడుతోంది. ఇంతకీ మూడు రోజుల(నవంబర్ 12 నుంచి 14 వరకు) కలెక్షన్స్ ఎంతంటే..
Tiger 3 Business Deals :టైగర్ జిందాహైకు సీక్వెల్‍గా వచ్చిన టైగర్-3కి ముందు నుంచే మంచి డిమాండ్ ఏర్పడడం వల్ల.. దీని హక్కులను దక్కించుకునేందుకు అనేక థియేటర్లు, ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీకి ఏకంగా రూ.300 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం.
వరల్డ్‌వైడ్‌గా..
Tiger 3 Worldwide Collections :ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.240 కోట్ల గ్రాస్ (వరల్డ్‌వైడ్) కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది టైగర్ 3. ఫస్ట్ డే- రూ.92 కోట్లు, రెండో రోజు- రూ.81.18 కోట్లు, మూడో రోజు- రూ.66.82 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
భారత్‌లో నెట్ కలెక్షన్స్..
Tiger 3 India Collections :టైగర్-3 సినిమాకు మన దేశంలో తొలి మూడో రోజుల్లోనే ఏకంగా రూ.148.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. తొలి రోజు- రూ.43.50 కోట్లు, రెండో రోజు- రూ.59.25 కోట్లు, మూడో రోజు- రూ.45.75 కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుంది. ఇక దీని గ్రాస్ విలువ రూ.180.50 కోట్లుగా ఉంది.