తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Leo Movie Twitter Review : విజయ్​ 'లియో' రివ్యూ.. 'రోలెక్స్​'తో ఫైట్​... లోకేశ్​ మ్యాజిక్​ చేశాడా లేదా? - విజయ్ దళపతి లియో మూవీ రివ్యూ

Thalapathy Vijay Leo Movie Twitter Review : దళపతి విజయ్ - లోకేశ్​ కనగరాజ్​ లియో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ట్విట్టర్​ రివ్యూ చూద్దాం..

Leo Movie Twitter Review : విజయ్​ 'లియో' రివ్యూ.. లోకేశ్​ మ్యాజిక్​ చేశాడా లేదా?
Leo Movie Twitter Review : విజయ్​ 'లియో' రివ్యూ.. లోకేశ్​ మ్యాజిక్​ చేశాడా లేదా?

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 7:36 AM IST

Updated : Oct 19, 2023, 9:41 AM IST

Thalapathy Vijay Leo Movie Twitter Review : దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ గ్యాంగస్టర్​ మూవీ 'లియో' థియేటర్లలోకి వచ్చేసింది. 'మాస్టర్' తర్వాత దర్శకుడు లోకేశ్​ కనగరాజ్ - విజయ్ కాంబినేషన్​లో వచ్చిన చిత్రమిది. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో దీనిపై విపరీతమైన భారీ అంచన్నాలు ఉన్నాయి. అందుకే సినీ ప్రియులు, విజయ్ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు.

ట్విట్టర్​ రివ్యూలు ప్రకారం..సినిమా బ్లాక్ బాస్టర్​. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బాస్టర్​. సినిమా స్లోగా ప్రారంభమై.. ప్రతీ క్యారెక్టర్​ను అద్భుతంగా చూపించారు. ఇంటర్వెల్​కు 10 నిమిషాల ముందు గూస్​బంప్స్​ వస్తాయి. సెకండాఫ్​ కూడా బాగుందట. కానీ కాస్త డౌన్​ అయిందంటున్నారు. లియో దాస్​గా దళపతి విజయ్​ స్క్రీన్ ప్రెజెన్స్​ యాక్టింగ్ అదిరిపోయింది. లోకేశ్ కనగరాజ్​ డైరెక్షన్​, స్టోరీ, స్క్రీన్​ ప్లే నెక్ట్స్​ లెవల్​. మంచి రేసీగా ట్విస్ట్​లతో సాగింది. సంజయ్​ దత్​ మైండ్​ బ్లో యాక్టింగ్​. అనిరూధ్ రవిచందర్​ మ్యూజిక్​ సినిమాకే హైలైట్​.

అయితే ఈ చిత్రం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​ LCUలో భాగమా కాదా అని మొదటి నుంచి మూవీటీమ్​ సస్పెన్స్​లో పెట్టింది కదా. అది క్లారిటీ అయిపోయింది. సినిమా LCUలో భాగంగానే చూపించారట. రోలెక్స్​తో('విక్రమ్' సినిమాలో సూర్య పాత్ర) విజయ్ చేసే ఫైటింగ్​ అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర సూర్య నటించలేదట. ఆయన పోలికలతో ఉన్న మరో ఆర్టిస్ట్​ను చూపించారని అంటున్నారు. ఇక 'ఖైదీ' చిత్రంలోని పోలీస్ కానిస్టేబుల్ నెపోలియన్ కూడా ఈ సినిమాలో ఉన్నారట. లోకేశ్​ టేకింగ్​లో మ్యాజిక్ ఉందని అభిప్రాయపడుతున్నారు.

నెగటివ్​ రివ్యూస్​ కూడా.. అయితే కొన్ని నెగటివ్​ రివ్యూలు కూడా కనిపిస్తున్నాయి. లోకేశ్​ గత చిత్రం విక్రమ్​తో పోలిస్తే లియో కాస్త తక్కువేనని కూడా చెబుతున్నారు. సినిమాలో కొత్త దనం ఏం లేదని, రొటీన్​గా సాగిందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రిజల్ట్​పై మరింత క్లారిటీ రావాలంటే రెండు మూడు ఆగితే తెలుస్తుంది.

Bhagvant Kesari Twitter Review బాలయ్య హ్యాట్రిక్​.. ప్రతీ ఆడపిల్ల చూడాల్సిన సినిమా!

Last Updated : Oct 19, 2023, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details