తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ సీన్​​ కోసం 5 రోజులు గాల్లోనే- రిలీజ్ తర్వాత చిరు సర్​ రిప్లై ఏంటంటే' - తేజ సజ్జ స్టంట్స్

Teja Sajja Hanuman Stunts: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ 'హనుమాన్' మూవీతో సూపర్​ హిట్​ కొట్టారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ విశేషాలు, స్టంట్స్​ గురించి తేజా రీసెంట్​గా షేర్ చేసుకున్నారు.

Teja Sajja Hanuman Stunts
Teja Sajja Hanuman Stunts

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 3:43 PM IST

Updated : Jan 14, 2024, 3:59 PM IST

Teja Sajja Hanuman Stunts: 'హనుమాన్' సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ ఖాతాలో వేసుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జ. జనవరి 12న రిలీజైన ఈ మూవీ పాన్ఇండియా లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన విజువల్ వండర్స్​కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే హైదరాబాద్‌లో రీసెంట్​గా హీరో తేజ మీడియాతో సినిమా మాట్లాడారు. ఈ సెషన్​లో మూవీ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు. అవేంటో తెలుసుకుందాం.

  • యాక్షన్ సీన్స్​లో ఛాలెంజింగ్​గా అనిపించిన అంశాలు? ఈ సినిమా జర్నీలో నేర్చుకున్నది ఏమిటి?

'ఓపికగా ఉండటం నేర్చుకున్నా. నా పని ఛాలెంజ్​లు స్వీకరించడం. అందుకే దేనిని కూడా సవాల్ అని అనుకోలేదు. వచ్చిన ఛాన్స్​ను నిలబెట్టుకోవాలి. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీన్స్ అన్నీ ఒరిజినల్. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌లో హనుమంతుల వారు వస్తున్నప్పుడు నేను గాల్లో ఉండే సీక్వెన్స్‌ ఏదీ డూప్ చేయలేదు. ముఖ్యంగా ఆ సీన్​లో గాల్లో ఉండే సీక్వెన్స్‌ కోసం ఐదు రోజులు చాలా కష్టపడ్డాం. సినిమాలో కనిపించే హనుమాన్‌ విగ్రహం షాట్‌ను గ్రాఫిక్స్‌ చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది'.

  • మూవీలో హనుమాన్ పాత్రను మెగాస్టార్​ను దృష్టిలో పెట్టుకునే చేశారా?

'చిరంజీవి సర్‌కి హనుమాన్ గురించి, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఉద్దేశం గురించి ముందు​ నుంచే తెలుసు. అయితే గ్రాఫిక్స్‌ చేస్తున్నప్పుడు కొన్ని లేయర్స్‌లో లుక్‌ను మ్యాచ్‌ చేయడం ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత జరిగిన విషయం చిరు సర్‌కు తెలుసు. హనుమాన్ సినిమా విషయంలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక 'కంగ్రాట్స్‌ మై బాయ్‌' అని విష్ చేస్తూ మెసేజ్ చేశారు'.

  • హనుమాన్ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. మరో సినిమా సైన్ చేయలేదు. అంత నమ్మకం ఏంటి?

'నా కన్నా ఈ సినిమాపై మా నిర్మాత నిరంజన్‌ రెడ్డికి బలమైన నమ్మకం ఉంది. హనుమాన్ కోసం తను చాలా చేశాడు. అందుకే ఇది పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ సైన్ చేయకూడదని డిసైడయ్యా'

  • థియేటర్ల సమస్యతో ఒత్తిడికి గురయ్యారా?

'రిలీజ్​కు పది రోజుల ముందు నుంచి కూడా నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మాకు అన్నీ కలిసొచ్చాయి. ఆ హనుమంతులవారే మమ్మల్ని నడిపిస్తున్నారనింపించింది. మేం ఏన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లలోకి వచ్చేశాం. ఇప్పుడు అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. ఈ విజయం పూర్తిగా ప్రేక్షకులదే. ప్రతి హీరోకి తమ కెరీర్‌లో మైలురాయి లాంటి చిత్రం ఒకటి కచ్చితంగా పడుతుంటుంది. నా విషయంలో అది హనుమాన్ మూవీయే.

'హనుమాన్'​ కలెక్షన్స్​ - రెండో రోజు భారీగా జంప్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

తీసినోడు నా కొడుకు - 'హనుమాన్' దర్శకుడి తండ్రి వీడియో వైరల్​

Last Updated : Jan 14, 2024, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details