కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. ఇటీవలే కామెర్ల వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు తెలిపారు. దీంతో యావత్ కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. రఘురాం మృతి పట్ల ఆయన స్నేహితులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమిళంలో 2017లో వచ్చిన 'ఒరు కిదైయిన్ కరుణై మను' చిత్రానికి సంగీతమందించారు. 2011లో 'రివైండ్', 'ఆసై'తో పాటు మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు.
ఇండస్ట్రీలో విషాదం.. యువ సంగీత దర్శకుడి మృతి - తమిళ డైరెక్టర్ మృతి
చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇండస్ట్రీలో విషాదం.. యువ సంగీత దర్శకుడి మృతి