Rocketry Madhavan: కథ, పాత్ర కోసం తమను తాము మార్చుకుంటుంటారు కథానాయకులు. తాజాగా 'రాకెట్రీ' సినిమా కోసం సీనియర్ హీరో మాధవన్ కూడా అదే చేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. దీన్ని స్వీయ దర్శకత్వంలో మాధవన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నంబి నారాయణన్‌తో కలిసి షూటింగ్ చూసేందుకు వచ్చిన నటుడు సూర్య సెట్స్‌లో నారాయణన్ గెటప్‌లో ఉన్న మాధవన్‌ను చూసి అమిత ఆశ్చర్యానికి గురయ్యారు. 'ఇది కలా? నిజమా' అన్నట్లు నోరెళ్లబెట్టారు. సూర్య, నంబి నారాయణన్ రాగానే కుర్చీలో నుంచి లేచి మాధవన్ ఇరువురికి స్వాగతం పలికారు.
మాధవన్‌ను అలా చూసి షాకైన సూర్య.. ఏం జరిగిందంటే? - madhavan rocketry director
Rocketry Madhavan: సీనియర్ హీరో మాధవన్‌ను చూసి అమిత ఆశ్చర్యానికి గురయ్యారు కథానాయకుడు సూర్య. 'ఇది కలా? నిజమా' అన్నట్లు నోరెళ్లబెట్టారు. అసలేం జరిగిందటే..
"నా స్నేహితుడు సూర్య అంటూ నారాయణన్‌కు పరిచయం చేశారు. వెంటనే 'మీ నటన, మీ నాన్నగారు (శివకుమార్) దర్శకత్వం నాకు బాగా నచ్చుతుంది' అంటూ నారాయణన్ చెప్పడం వల్ల సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో సూర్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే పాత్రను హిందీలో షారుక్ ఖాన్ చేస్తున్నారు. 'రాకెట్రీ'లో నంబి నారాయణన్ భార్య పాత్రలో సిమ్రన్ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: 8 ఏళ్లకు ఆ కుటుంబంలో చిరునవ్వు.. అమ్మ చెంతకు కూతురు.. ఈటీవీ వల్లే ఇదంతా!