తెలంగాణ

telangana

Suresh Gopi Journalist Video : సురేశ్​ గోపీ అసభ్య ప్రవర్తన.. జర్నలిస్ట్​కు సారీ చెప్పిన మలయాళ నటుడు

Suresh Gopi Journalist Video : ప్రముఖ నటుడు మాజీ ఎంపీ సురేశ్​ గోపీ తాజాగా ఓ మహిళా జర్నలిస్ట్​కు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 7:55 PM IST

Published : Oct 28, 2023, 7:55 PM IST

Suresh Gopi Journalist Video
Suresh Gopi Journalist Video

Suresh Gopi Journalist Video : మలయాళ నటుడు, మాజీ ఎంపీ సురేశ్‌ గోపీ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన ప్రవర్తించిన తీరు గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన సదరు విలేకరికి సారీ చెప్పారు. ట్విట్టర్​ వేదికగా ఓ పోస్ట్​ పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. "ఆమెను నేనొక కుమార్తెగా భావించాను. ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశాను. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను" అని ఆయన రాసుకొచ్చారు.

అసలేం జరిగిందంటే..?
Suresh Gopi Tweet :నార్త్‌-కొయ్‌కోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేశ్‌ గోపీ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన పలువురు జర్నలిస్ట్‌లతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన సదరు విలేకరి కాస్త దూరం జరిగింది. అనంతరం, మరో ప్రశ్న అడిగేందుకు ఆమె ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను తాకారు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును తప్పుబట్టారు. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ పెట్టారు.

Suresh Gopi Movies List : మలయాళంలో సీనియర్​ నటుడుగా పేరొందిన సురేశ్​.. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 'యువజనోత్సవం', 'పి.సి.369', 'సాయం సంధ్యా', 'న్యూ దిల్లీ', 'ది న్యూస్‌', 'పరంపర', 'డాడీ', 'ధ్రువమ్‌' వంటి చిత్రాలతో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 'అంతిమ తీర్పు', 'ఆ ఒక్కడు' లాంటి తెలుగు సినిమాల్లోనూ ఆయన నటించారు.

Suresh Gopi Political Career : రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సురేశ్​.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో త్రిసూర్ స్థానం నుండి పోటీ చేశారు. కానీ రెండుసార్లు విఫలమయ్యారు. అప్పటి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి తన పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదొక తీవ్రమైన చర్య.. ఆ స్టూడెంట్​ ప్రవర్తన వల్ల చాలా బాధపడ్డా: అపర్ణ

Lokesh Kanagaraj Injured : 'లియో' ప్రమోషన్స్​లో తొక్కిసలాట.. లోకేశ్​ కనగరాజ్​కు గాయం.. అన్నీ వాయిదా!

ABOUT THE AUTHOR

...view details