తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హీరో మాధవన్​పై రజనీకాంత్​ కామెంట్స్​.. ఏమన్నారంటే? - మాధవన్ రాకెట్రీ

Rajnikanth praises Madhavan Rocketry: 'రాకెట్రీ' సినిమాపై ప్రశంసలు కురిపించారు సూపర్​స్టార్​ రజనీకాంత్. నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని అన్నారు.

Rocketry Rajnikanth comments
రజనీకాంత్​ రాకెట్రీ

By

Published : Jul 4, 2022, 4:33 PM IST

Rajnikanth praises Madhavan Rocketry: నటుడు మాధవన్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాకెట్రీ'. నంబి నారాయణన్‌ బయోపిక్‌గా రూపొందిన ఈ మూవీ ఇటీవల విడుదలై సిద్ధమైన 'రాకెట్రీ' విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. తాజాగా ఈ మూవీని వీక్షించిన సూపర్​స్టార్​ రజనీకాంత్​.. నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని అన్నారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.

"ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం 'రాకెట్రీ'. మన దేశ అంతరిక్ష పరిశోధన అభివృద్ధి కోసం పద్మభూషణ్‌ నంబినారాయణ్‌ ఎంత కష్టపడ్డారు? ఎన్ని త్యాగాలు చేశారు? అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమాతో తొలిప్రయత్నంలోనే తానూ పేరు పొందిన దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారు. ఇలాంటి అద్భుతమైన కథను రియలిస్టిక్‌గా చెప్పిన మాధవన్‌కు నా అభినందలు" అని రజనీ పేర్కొన్నారు.

ఈ చిత్రంలో.. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నారాయ‌ణ‌న్ చ‌దువుకున్న రోజులు మొద‌లుకొని.. రాకెట్ సైన్స్ కోసం ఆయ‌న చేసిన కృషి.. గూఢ‌చ‌ర్యం కేసులో అరెస్టు కావడం.. నిరపరాధిగా బయటపడటం ఇలా ఎన్నో విషయాలను చూపించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: ఉమెన్​ సెంట్రిక్​ వెబ్​సిరీస్​తో క్రిష్​.. ప్రభాస్ కోసం కొరటాల ప్లాన్​!

ABOUT THE AUTHOR

...view details