Suma Apologize : యాంకర్ సుమ అంటే బుల్లితెర వినోదం.. బుల్లితెర వినోదం అంటే యాంకర్ సుమ... అలా అంతటి బంధాన్ని పెనవేసుకుంది. తన యాంకరింగ్‌తో టాలీవుడ్లో యాంకర్ క్వీన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్వించే ఆమె.. తాజాగా 'ఆదికేశవ' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ సరదాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఏం జరిగిందంటే?.. 'ఆదికేశవ' సినిమాలోని సాంగ్ రిలీజ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్ కోసం పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, చిత్ర దర్శకుడు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఈవెంట్ కాస్త ఆలస్యం అవ్వడం వల్ల.. సుమ సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌ను ప్రారంభంలో.. "మేం పెట్టిన స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు.. తొందరగా లోపలికి వచ్చి కెమెరాలు పెట్టండి. బాబు మీరు కెమెరా పెట్టారు కదా.. మీరు ఓ ముగ్గురికి చెప్పండి.. వాళ్లను మరో ముగ్గురికి చెప్పమనండి" అంటూ మీడియా కెమెరామెన్లపై సరదాగా సెటైర్ వేశారు.
దీంతో సుమ చేసిన కామెంట్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పడిన మీడియా ప్రతినిధులు.. "ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. చాలా ఎనర్జిటిక్‌గా హోస్ట్ చేస్తారు. అది చాలా ఇష్టం. అయితే ఈ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు స్నాక్స్‌ను భోజనంలా చేస్తున్నారు అని అనకుండా ఉండాల్సింది" అని అన్నారు.