తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాజమౌళి మూవీకి సెంథిల్​ దూరం, మహేశ్​ సినిమాలో కొత్త సినిమాటోగ్రాఫర్- జక్కన్న స్కెచ్​ ఏంటి? - మహేశ్​ రాజమౌళి మూవీ సినిమాటోగ్రాఫర్​

SSMB 29 Cinematographer : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్​ బాబు సినిమాపై వర్క్​ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్​ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు ఓ కొత్త సినిమాటోగ్రాఫర్​ను ఖరారు చేశారట రాజమౌళి. ఇంతకీ ఆయన ఎవరంటే..

SSMB 29 Cinematographer
SSMB 29 Cinematographer

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 2:20 PM IST

Updated : Nov 7, 2023, 2:27 PM IST

SSMB 29 Cinematographer : 'ఆర్​ఆర్​ఆర్​' సక్సెస్​ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్​ బాబు సినిమాపై వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన టీమ్​తో పాటు స్క్రిప్టింగ్ పనిలో ఉన్నారు. అది పూర్తయిన తర్వాత అఫీషియల్​గా అనౌన్స్​ చేయనున్నారని సమాచారం. అయితే మహేశ్​ ఇప్పుడు 'గుంటూరు కారం' షూటింగ్​లో బిజీగా ఉన్నందున ఈ సినిమా కంప్లీట్ అయ్యాక జక్కన్న ప్రాజెక్ట్​ వచ్చే ఏడాది సెట్స్​పైకి వెళ్లనున్నదట.

రాజమౌళి సినిమా అంటే అందులో కీరవాణి పాటలతో పాటు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫీ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. 'బాహుబలి','ఆర్ఆర్ఆర్', సినిమాలకు సెంథిల్​ వర్క్​ చేశారు. అయితే రాజమౌళి- మహేశ్​ సినిమాకి మాత్రం జక్కన్న మరో సినిమాటోగ్రాఫర్​ను ఎంపిక చేశారట. దీనికి కారణం సెంథిల్ ప్రస్తుతం డైరెక్టర్​గా ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో సెంథిల్​ ప్లేస్​లో పిఎస్ వినోద్​ పనిచేయనున్నారట. వినోద్​.. 'పంజా', 'ధృవ', 'అల వైకుంఠపురంలో', 'అరవింద సమేత' లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్​గా పని చేశారు.

మరోవైపు మహేశ్​ బాబుతో జక్కన్న తెరకెక్కించనున్న సినిమా పాన్ వరల్డ్ రేంజ్​లో రూపొందుతోంది. దీంతో ఈ సినిమా 'ఆర్ఆర్ఆర్'ను మించిపోయేలా హాలీవుడ్ స్టాండర్డ్స్​లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో వినోద్ కచ్చితంగా స్టార్ సినిమాటోగ్రాఫర్​గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పీఎస్ వినోద్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​కు ఫేవరేట్ కెమెరామెన్​గా ఉన్నారు. ఆయన సినిమాలకి వినోద్​ వరుసగా పని చేస్తున్నారు.

SSMB 29 Story Line :ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్​ సినిమాల తరహాలో ఉండనున్న ఈ సినిమాలోయయ మహేశ్​ బాబు క్యారెక్టర్ రామాయణంలోని హనుమంతుడి పాత్రను పోలి ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల్లో జరిగే అక్రమాలపై మహేశ్​ బాబు పోరాడనున్నారట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగనున్న ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో జరగనున్నట్లు సమచారం. ఇక ఈ సినిమా కోసం జక్కన్న.. హాలీవుడ్​ నుంచి భారీ వీఎఫ్ఎక్స్​​ టెక్నీషియన్స్​ను రంగంలోకి దింపనున్నారట. ఈ సినిమాను మూడు భాగాల్లో తెరకెక్కించనున్నారన్న వార్తలు కూడా అప్పట్లో జోరందుకున్నాయి.

Mahesh Rajamouli Movie : జక్కన్న - మహేశ్ సినిమాలో విలన్​గా టాలీవుడ్ స్టార్ హీరో!

మహేశ్​ ఫ్యాన్స్​కు ముందుగానే దీపావళి షురూ - గుంటూరు కారం 'దమ్​ మసాలా' సాంగ్​ ప్రోమో వచ్చేసిందోచ్​

Last Updated : Nov 7, 2023, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details