తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​తో సినిమా కోసం త్రివిక్రమ్ మాస్టర్​ ప్లాన్.. యంగ్​ రైటర్స్​తో కలిసి ఏడాదిగా! - తివిక్రమ్ టీమ్​లో మార్పులు

SSMB 28 Trivikram : త్వరలోనే మహేశ్​ బాబు-తివిక్రమ్​ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అయితే ఈ మూవీ కోసం తివిక్రమ్​.. కొంతమంది యంగ్​ రైటర్స్​ను తీసుకున్నారట. గతేడాది నుంచి వారంతా తివిక్రమ్​తో పనిచేస్తున్నారట. తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెట్టి పూర్తిగా యాక్షన్ పైనే ఆయన​ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ssmb 28 movie
ssmb 28 movie

By

Published : Sep 9, 2022, 6:55 PM IST

SSMB 28 Trivikram : టాలీవుడ్​లో ఉన్న ఫైనెస్ట్ రైటర్స్​లో త్రివిక్రమ్ శ్రీనివాస్​ ఒకరు. తన సినిమాలకు డైలాగ్ వెర్షన్ మొత్తం ఆయనే రాసుకుంటారు. తన తదుపరి సినిమా టాలీవుడ్​ స్టార్​ హీరో మహేశ్​ బాబుతో చేయనున్న నేపథ్యంలో కొంతమంది యంగ్ రైటర్స్​ను తీసుకున్నారట. వారు సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఆయనకు నచ్చడం వల్ల.. స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ రెడీ చేశారట త్రివిక్రమ్. ఈ యంగ్ రైటర్స్ టీమ్ గతేడాది కాలంగా త్రివిక్రమ్​తో పని చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్​ను త్రివిక్రమ్​ లాక్ చేశారట. 'అలా.. వైకుంఠపురములో' సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరూ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ.. కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుండగా.. హారిక అండ్ హాసిని సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారట త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పైనే ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ అయిన ఫ్యామిలీ సీన్లు ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేశ్​ మాత్రం యాక్షన్​పై దృష్టిపెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్​లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఆలస్యమైందని సమాచారం.

ఇవీ చదవండి:తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. సీమంతం ఫొటోలు​ వైరల్

రామ్​చరణ్​ 'RC15'లో స్టార్​ డైరెక్టర్​.. యుద్ధ వీరుడిగా హీరో సూర్య!

ABOUT THE AUTHOR

...view details