'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్-వర్ష జోడీ ఎంత పాపులర్తో తెలిసిన విషయమే. ఇద్దరు కలిసి స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తుంటారు. చాలా సార్లు వీరిద్దరు తమ మధ్య ఉన్న ప్రేమను కూడా బయటపెట్టారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు విపరీతంగా వచ్చాయి. అయిన ఇదంతా నిజమేనని చెబుతూ.. పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశాడు ఇమ్మాన్యుయెల్. వర్ష తనకు దూరమైందంటూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్యాడ్ లవ్ సాంగ్స్ పాడి తనలోని బాధను బయటపెట్టాడు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా తాజాగా పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది.
ఇందులో ఇమ్యాన్యుయెల్ హార్ట్ఫీల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నాలుగు ప్రేమ విషాద గీతాలు ఆలపించాడు. ఘర్షణలోని 'చెలియా చెలియా', నా ఆటోగ్రాఫ్లోని 'నువ్వంటే ప్రాణమని' అంటూ వర్షను ఉద్దేశించి విషాద పాటలను పాడాడు. ఇమ్మూ పాట పాడుతున్నంత సేపు వర్ష కూడా ఎంతో బాధతో కనిపించింది. ఇమ్మూ పాడటం, వర్ష బాధపడటం సన్నివేశాలు హృదయాన్ని హత్తుకున్నాయి.