తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sreeleela Interview : 'ఆ సీన్​ సమయంలో బాలయ్య అక్కడే ఉన్నారు' - భగవంత్​ కేసరి మూవీ రిలీజ్ డేట్​

Sreeleela Interview : ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అగ్ర తారలతో స్క్రీన్ షేర్ చేసుకుంది యంగ్​ బ్యూటీ శ్రీలీల. తాజాగా బాలకృష్ణతో 'భగవంత్​ కేసరి' సినిమాలో నటించింది. అక్టోబర్​ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీలీల విలేకరులతో ముచ్చటించింది ఆ విశేషాలు మీ కోసం..

Sreeleela Interview
Sreeleela Interview

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 11:12 AM IST

Sreeleela Interview :యాక్టర్‌ కావాలనుకుని డాక్టర్‌ అయ్యానని అంటుంటారు చాలా మంది. కానీ యంగ్​ బ్యూటీ శ్రీలీల మాత్రం అందుకు భిన్నం. అటు నటనతో పాటు ఇటు వైద్య విద్యని అభ్యసిస్తూ తన కెరీర్​లో సక్సెస్​ఫుల్​గా రాణిస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాలు అందుకుని దూసుకెళుతున్న శ్రీలీల.. తాజాగా 'భగవంత్‌ కేసరి'లో బాలకృష్ణతో స్క్రీన్​ షేర్​ చేసుకుంది. ఈ సినిమాలో విజ్జి పాపగా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఈ నెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా శ్రీలీల శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విశేషాలు మీ కోసం..

హీరోయిన్​గా వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో కూతురుగా నటించడానికి కారణం?
ఈ విషయం గురించి చాలా మంది భయపెట్టారు. కెరీర్‌ ఆరంభంలో ఇలాంటివి చేయకూడదు అని అన్నారు. కథ బాగా నచ్చడంతో వల్ల నేను అవన్నీ ఆలోచించకుండా ఈ సినిమాకు ఓకే చెప్పాను. అందంగా కనిపించే పాత్రలు ఎన్నో చేస్తాం. కానీ ఎమోషన్స్​ ఉన్న ఇలాంటి పాత్రలు అన్నిసార్లూ రావు. నేనొక నటిగా నిరూపించుకునేందుకు అవకాశం ఉన్న సినిమా ఇది. పైగా నేను కూతురు పాత్రలు చేయదగ్గ వయసులోనే ఉన్నాను. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత ఇలాంటి పాత్రలు చేయలేం కదా అని అనిపించింది.

ఈ పాత్ర ఎలా ఉంటుంది?
విజ్జి పాప ధైర్యం లేని ఓ అమ్మాయి. కానీ చలాకీగా ఉంటుంది. 'పెళ్లిసందడి'లో నేను కొంచెం గంభీరంగా మాట్లాడే అమ్మాయిగా కనిపిస్తాను. 'ధమాకా'లో ఇంకో రకం. ఈ రెండు పాత్రలతో పోలిస్తే ఈ క్యారెక్టర్​ మరింత భిన్నంగా ఉంటుంది. అనిల్‌ రావిపూడి తన స్టైల్‌ నుంచి మరో భిన్నమైన స్టైల్‌కి వచ్చి చేసిన సినిమా ఇది.

విజ్జి పాప పాత్ర మీపైన ఎలాంటి ప్రభావం చూపించింది?
నాలోనే విజ్జి పాప ఉంది. అందుకే ఈ రోల్​ నాకు అంతగా కనెక్ట్‌ అయ్యింది. బాలకృష్ణ సర్‌ని కూడా నేను సెట్‌లో ఎప్పుడూ ఓ నటుడిగా చూడలేదు. ఆయన నేలకొండ భగవంత్‌ కేసరి, నేను విజ్జిపాప. సెట్‌ నుంచి ఇంటికొచ్చాక కూడా ఆ ఎమోషన్​ అలాగే కొనసాగేది. సినిమా చూశాక ఆ ప్రభావం నాపై ఎంత ఉందో ఆడియెన్స్​కు అర్థం అవుతుంది. శ్రీలీల అనగానే డ్యాన్స్‌ అని అంటున్నారు. అది నాకు కలిసొచ్చే విషయమే అయినప్పటికీ... నటిగానూ నేనేంటో నిరూపించుకోవాలి కదా. ఈ సినిమాతో నాకు ఆ అవకాశం దొరికింది.

బాలకృష్ణతో కలిసి నటించారు. సెట్‌లో గడిపిన క్షణాలు, ఆయనతో ఉన్న అనుభవాల్ని పంచుకుంటారా?
బయట ఎన్నో అభిప్రాయాల్ని విని ఓ నిర్ణయానికి వస్తాం. అలా నేను తొలి రోజు బాలకృష్ణ సర్‌ని కలిసినప్పుడు భయం భయంగానే మాటలు కలిపాను. కానీ ఒక్కసారి మాట్లాడాక ఆయన మనసేమిటో నాకు అర్థమైంది. ఆయన మనసుకు తగ్గట్టే బాలకృష్ణ అని పేరు పెట్టారు. చాలా స్వీట్‌ పర్సన్‌. ట్రైలర్‌లో కనిపిస్తున్న పుష్‌అప్స్‌ తీసే సన్నివేశమే తొలిరోజు చేశాను. అప్పుడు అక్కడే బాలకృష్ణ సర్‌ ఉన్నారు.

నటన గురించి బాలకృష్ణ ఏమైనా సలహాలు ఇచ్చారా?
ఆయనకు అన్ని రంగాలపైనా గొప్ప పరిజ్ఞానం ఉంది. సెట్‌లో ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. నేను మెడిసిన్‌కి సంబంధించిన పరీక్షలు రాసి, ఆ రోజే సెట్స్‌కి వచ్చాను. ఆయనకి విషయం చెబితే... వైద్యం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నారు. 'మీరు మెడిసిన్‌ చేయలేదు కదా, ఇవన్నీ మీకెలా తెలుసు' అని అడిగాను. బసవతారకం హాస్పిటల్‌ ఛైర్మన్‌గా పనిచేయడం వల్ల ఆ రంగం గురించి ఆయనకి ఎంతో అవగాహన ఉంది. అలా ప్రతి రంగం గురించీ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఎప్పుడు ఎలా మసలుకోవాలో చెప్పారు. డబ్బింగ్‌ సమయంలో బాలకృష్ణ, కాజల్‌ మధ్య సన్నివేశాల్ని చూశాను. అవి చాలా బాగుంటాయి. కామెడీ కూడా నాకు బాగా నచ్చింది.

తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కదా. తెలంగాణ యాస విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
తెలుగు రావాలి కానీ... ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మాట్లాడతాం. హైదరాబాద్‌లో ఉంటున్నాను కానీ, యాసపై కాస్త అవగాహన ఉంది. దర్శకుడు కూడా చాలా సలహాలు ఇచ్చారు.

ఈ సినిమాలో మీకు సవాల్‌ విసిరిన సందర్భం?
ఒక నటిగా నన్ను నేను పరీక్షించుకునేలా చేసింది ఈ చిత్రం. నాలోనే విజ్జి పాప ఉండటంతోనేమో... నేను సెట్లో భగవంత్‌ కేసరి చెప్పే ప్రతి మాటనీ నా హృదయానికి తీసుకుని అందుకు తగ్గట్టుగానే నటించేదాన్ని. 'ఆడపిల్ల లేడీ పిల్లలా కాదు, పులి పిల్లలా వుండాల'నే ఓ డైలాగ్​ ఉంది. నన్నలా చూడాలనేది సినిమాలో హీరో తపన. ఆ తపనని ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నేను అందుకు తగ్గట్టు నటించాలి. అలా ఈ కథతోనూ, పాత్రతోనూ పూర్తిగా కనెక్ట్‌ అయ్యి నటించాను. నిజ జీవితంలో నాకు చిచ్చా అంటే మా అమ్మే. తను నా చిన్నప్పుడు అలాంటి ఎన్నో సలహాలు ఇస్తూ పెంచింది.

ఒకవైపు చదువు.. మరోవైపు సినిమా. ఈ జర్నీ మీకు కష్టంగా అనిపించడం లేదా?
నటన కాకుండా ఏదైనా చేయాలంటే పుస్తకాలు తీస్తాను. డాక్టర్‌ కావాలనేది చిన్నప్పట్నుంచి నాకున్న ఓ బలమైన కోరిక. మా అమ్మమ్మ ఇంట్లో పడిపోతే ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. వైద్యుడైన మా అన్నయ్య వచ్చి చిన్నపాటి వైద్యం చేశాక కొన్ని క్షణాల్లోనే ఆమె లేచింది. అప్పుడే అనుకున్నా, నేను డాక్టర్​ను కావాలని. ఓ సినిమాకి డేట్స్‌ ఇస్తున్నానంటే అప్పుడే ఫిక్స్‌ అయిపోతాను, నేను ఇక నుంచి రాత్రిళ్లు లేచి చదవాల్సి ఉంటుంది అని.

నటన... డ్యాన్స్‌. ఈ రెండింటినీ మీరు చూసే కోణం ఎలాంటిది? దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు?
రెండింటినీ బ్యాలెన్స్​ చేసుకుంటూ ప్రయాణం చేయాలి. డ్యాన్స్‌ అనేది నా డ్రీమ్​. నేను యాక్టింగ్​ నేర్చుకున్నది డ్యాన్స్​ వల్లనే. చిన్నప్పటి నుంచీ నేను భరతనాట్యం డ్యాన్సర్‌ని. భరతనాట్యంలో ఓ కథ చెప్పాలంటే హావభావాలతోనే చెబుతుంటాం. అలా అభినయం నాకు అలవాటైంది. అయితే నాట్యంలో కొన్ని హావభావాలు గంభీరంగా ఉంటాయి. కానీ సినిమా నటనకి వచ్చేసరికి ప్రతిచోటా ఎక్కువ హావభావాలు పనికి రావు. కొన్నిసార్లు ముఖంలో ఎలాంటి హావభావం లేకపోయినా కూడా ఓ భావం వస్తుంది. ఇలా ప్రతి సినిమాతోనూ నేర్చుకుంటున్నాను. దర్శకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా నటిస్తుంటాను.

Bhagavanth kesari trailer : స్టేజ్​పైనే శ్రీలీల కన్నీరు.. లైఫ్​లో మిస్సైన అనుభూతిని బాలయ్యే ఇచ్చారంటూ!

Kajal Sreeleela : అలా చేయడం చాలా కష్టం.. కానీ శ్రీలీల మాత్రం చేస్తుంది.. కాజల్ అగర్వాల్​

ABOUT THE AUTHOR

...view details