Soundarya Rajnikanth Daughter : సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, విషగన్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఆ శిశువుకు 'వీర్ రజనీకాంత్ వనంగమూడి' అని పేరు పెట్టారు. ఈ మేరకు సౌందర్య రజనీ కాంత్ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు."దేవుని దయ, తమ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడికి నేను, విషగన్ స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్లకు ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చారు.
వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో గతంలో సౌందర్య రజనీకాంత్‌కు వివాహమైంది. వారికి వేద్‌కృష్ణ జన్మించాడు. అయితే పలుకారణాలతో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య రాజనీకాంత్ 2019లో వివాహం చేసుకున్నారు.