ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ఈ ప్రోగ్రాంలో షారుక్ ఖాన్.. తన భార్య గౌరీ ఖాన్‌తో గొడవ పడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షారుక్ తన భార్య గౌరీతో తీవ్రంగా గొడవపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని చూసిన షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు! భార్య గౌరీ ఖాన్‌తో ఎంతో ప్రేమగా ఉండే షారుక్ ఇలా ప్రవర్తించడం ఏంటంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో షారుక్ ముందుగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రితేశ్ సిద్ధవానిని కౌగిలించుకున్నారు. ఆపై వేదిక వద్ద ఉన్న భార్య గౌరీ ఖాన్‌ను రితేశ్‌కు చూపించారు షారుక్. ఇది గమనించిన గౌరీ షారుక్‌తో వాగ్వాదానికి దిగారు. దీంట్లో అక్కడే డ్యాన్స్ చేస్తున్న గౌరీ వైపు షారుక్ కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బాద్షా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఈవెంట్‌కు ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. అయితే ఈ చిన్నపాటి వివాదంలోకి నటి ప్రియాంకను కూడా లాగుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే 'డాన్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచిందిన అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. ఆ కారణంగానే షారుక్.. గౌరితో గొడవ దిగారని బ్లేమ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో షారుక్ ప్రియాంకతో కలిసి స్టెప్పులేసినట్లుగా కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.
షారుక్, గౌరీ ఖాన్ గొడవ పడుతున్న వీడియో చూసిన కొందరు ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ప్రవర్తనతో హీరో షారుక్‌ను కాస్త విలన్‌గా చూస్తున్నారు. ఈ వ్యవహారంపై కొందరు డిఫరెంట్‌గా కామెంట్స్ పెడుతున్నారు. ఒకరైతే 'షారుక్ మమ్మల్ని మోసం చేశారు.. ఇప్పటివరకూ భార్యతో ప్రేమగా ఉన్నట్లు షారుక్ నటించారు' అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్.. 'ఇది మీ అస్సలు కథ.. అందరిముందు మంచివాడిలా నటిస్తూ భార్యతో ఇలా ప్రవర్తిస్తావా?' అంటూ ఫైర్ అయ్యాడు.
షారుక్ నటించిన పఠాన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం షారుక్ నటించిన జవాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. జూన్ 2న రిలీజ్ కానుంది.