Sanjay Dutt on Heroism: ఎవరి ఎంట్రీకి దిమ్మదిరిగి గాల్లో దుమ్మురేగుతుందో అతడినే అక్కడ హీరో అంటారు అంటూ సౌత్ సినిమాపై సంజయ్‌దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజీయఫ్-2లో అధీరాగా మెప్పించిన ఈ హీరో కమ్ విలన్ తన పాత్ర కోసం ఎంతో శ్రమించిన విషయం తెలిసిందే. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అటు బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంజూభాయ్ దక్షిణాది సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
విలన్ లేకుంటే హీరో ఎక్కడి నుంచి వస్తాడు: సంజయ్‌దత్
Sanjay Dutt on Heroism: దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలన్ లేకుంటే హీరో ఎక్కడి నుంచి వస్తాడంటూ స్పందించారు. సౌత్‌లో విలన్ క్యారెక్టర్లకు ఇచ్చే విషయంపై కూడా ఆయన తనదైన శైలిలో మాట్లాడారు.
'దక్షిణాది పరిశ్రమ హీరోయిజాన్ని మరువదు. ఇప్పటికీ అక్కడ హీరో ఎంట్రీ సీన్‌లో గాల్లో దుమ్ము రేగాల్సిందే. థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్‌లోనూ ఎలివేషన్ సీన్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మనం మరిచిపోయినా సౌత్ సినిమాల్లో ఇప్పటికీ అది కొనసాగుతోంది. త్వరలో మన దగ్గరా ఇలాంటి సినిమాలు వస్తాయి. అదే సమయంలో విలనిజానికి వారు అంతే ప్రాధాన్యం ఇస్తారు. హీరో అయినా విలన్ అయినా ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోవాలని కోరుకుంటారు. గతంలో అమ్రిశ్‌పురి లాంటి గొప్ప నటులు ప్రతినాయకుడి ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఓ 'జనక్ బాజీ', ఓ 'కల్‌నాయక్'ఇలా అప్పటి సినిమాలు చూసుకుంటే పరిచయ సన్నివేశాలను బలంగా చూపించేవారు. సినిమాకు అదెంతో ముఖ్యమని నేను భావిస్తాను. హాలీవుడ్ లోనూ యాక్షన్, సస్పెన్స్ ఇలా జానర్ ఏదైనా శక్తిమంతమైన విలన్ ఉంటాడు. విలన్ లేకుంటే హీరో ఎక్కడి నుంచి వస్తాడు?'అంటూ ఈ స్టార్ నటుడు తన మనసులో మాట బయటపెట్టాడు.
ఇదీ చూడండి: Alia Bhatt Citizenship: ఆలియా భట్‌ది భారత్ కాదట- ఏ దేశమో తెలుసా?