టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస ఆఫర్లతో దూసుకెళ్త్నున్నారు. గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న ఈ తార ట్రీట్మెంట్ తీసుకుంటునే సినిమా షూట్లల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే యశోద సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఈ తార ఆ తర్వాత విజయ దేవర కొండ ఖుషి సినిమాతో పాటు హాలివుడ్ సిరీస్ సిటాడెల్ షూట్లతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో తన ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. కాగా ఆ రూమర్స్‌కు చెక్క్ పెట్టేందుకు ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ సమంతకు సంబంధించిన ఓ యాక్షన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.
ఫుట్టైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సామ్ భారీ యాక్షన్ సీన్స్‌లో నటించనున్నారట. దీని కోసం ఆమె శిక్షణ కూడా తీసుకున్నారట. ఓ వైపు షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆందోళన చెందే ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సామ్. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేశారు. అది చూసిన అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలో గాయాలపాలైన తన రెండు చేతుల ఫొటోను షేర్ చేసిస సమంత.. యాక్షన్ సీన్స్ చేసినందుకు దొరికిన ప్రోత్సాహకాలు అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. టెక్ కేర్ సామ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.