మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే ఇటీవలే ఈ వ్యాధి కారణంగా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్‌కు కూడా విరామం ఇచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఈ విషయంపై సామ్ ఇటీవలే మాట్లాడింది. "విజయ్ దేవరకొండ అభిమానులను నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఖుషి సినిమా త్వరలోనే మళ్లీ ప్రారంభం అవుతుంది" అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. కానీ కరెక్ట్‌గా ఎప్పుడు సెట్స్‌లోకి అడుగుపెడుతుందో చెప్పలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మరో వార్త తెలిసింది. అదేంటంటే.. వచ్చే నెల మార్చి రెండో వారం నుంచి సమంత షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.