Samantha Health Update : అగ్ర కథానాయిక సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు దీని గురించి చెప్పుకొని బాధ కూడా పడింది. అయినప్పటికీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండానే ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంది. కానీ కొద్ది రోజుల క్రితం మాత్రం ఖుషి సినిమా సమయంలో కాస్త ఇబ్బంది తలెత్తడంతో ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. కేవలం ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపైనే దృష్టి పెట్టింది.
వెకేషన్ ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూనే చికిత్స తీసుకుంటోంది. ఈ మధ్యే హైదరాబాద్ తిరిగి వచ్చిన ఈమె.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ అప్డేట్స్ షేర్ చేస్తోంది. అలా తాజాగా తన ట్రీట్మెంట్కు సంబంధించి ఓ చిన్న అప్డేట్ను సోషల్ మీడియా ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసుకుంది. కైరో థెరపీ సెషన్‌కు హాజరైనట్లు చెప్పుకొచ్చింది. ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో ఆమె -150 డిగ్రీల ఫారెన్ హీట్‌లో పొగలు కక్కే చలిలో ఓ టబ్‌లో కూర్చొని కనిపించింది.
మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగ్గా పని చేయించడంతో పాటు, ఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉండేలా ఈ థెరపీ సహాయ పడుతుందని చెప్పుకొచ్చింది. "ఇన్ఫెక్షన్స్తో పోరాడే వైట్ బ్లడ్ సెల్స్ఉత్పత్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ సాఫీగా చేస్తుంది. మెంటల్ హెల్త్, ఎనర్జీని కూడా ఇస్తుంది. శరీరంలో ఉన్న మార్పును సరి చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది" అని రాసుకొచ్చింది.