Samantha Warning To Trollers: చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ట్రోలింగ్ బాధలు ఇటీవల సాధారణమైపోయాయి. హీరోయిన్ల విషయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ. వారు ఎలా ఉన్నా.. ఏం చేస్తున్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్. కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్‌ను పట్టించుకోరు. మరికొంతమంది మాత్రం ఆ ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో సామ్‌పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సమంతపై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.
'మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు'.. వారికి సమంత వార్నింగ్ - సమంత సినిమాలు
Samantha Warning: నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా సామ్.. ట్రోలర్స్‌కు ట్విట్టర్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. అది ఏంటంటే?
samantha
ఆ మధ్య ఒక అవార్డు ఫంక్షన్లో సామ్ వేసుకున్న డ్రెస్‌పై ట్రోల్స్ గట్టిగా వచ్చాయి. అయితే వాటన్నింటిని కొద్దిరోజులుగా చూస్తున్న సామ్.. శుక్రవారం ట్విట్టర్ ద్వారా ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "మంచితనాన్ని చేతకానితనాన్ని అనుకోవద్దు.. నా మౌనం అంగీకారం కాదు.. ప్రతి ఒక్క విషయానికి హద్దు ఉంటుంది" అంటూ రాసుకొచ్చారు.
ఇదీ చదవండి:మంచిదాన్ని కాదు: కియారా.. నాకు ఇదే తొలిసారి: భూమి
Last Updated : Apr 22, 2022, 6:18 PM IST