బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాపులర్ షో బిగ్‌బాస్. దాదాపు 15 సీజన్లు నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కార్యక్రమం త్వరలోనే సరికొత్త సీజన్‌ను ప్రారంభించుకోనుంది. అయితే ఈ సీజన్‌కు భాయ్ రూ.1000 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే వార్త కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై ఆయన స్పందించారు.
"నా పారితోషికం గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను రూ.1000 కోట్లు రెమ్యునిరేషన్ తీసుకొని ఉంటే ఇక జీవితంలో పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటా. ఎందుకంటే నాకు న్యాయపరమైన ఖర్చులు ఉన్నాయి. మీరు చెప్పే ఈ మొత్తంలో.. నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు. మీడియాలో వచ్చే ఈ వార్తలను ఆదాయపు పన్ను, ఈడీ కూడా చదువుతుంది"