తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Salman Khan Mythri Movies : మైత్రీ మూవీస్​తో సల్మాన్​ ఖాన్​.. మేనకోడలి సినిమాతో ప్రొడ్యూసర్​గా.. - సల్మాన్ ఖాన్​ బ్యానర్​

Salman Khan Mythri Movies : బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ తాజాగా ఓ సినిమాకు సంబంధించిన టీజర్​ను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. మైత్రీ మూవీస్​ మేకర్స్​తో సల్మాన్ ఖాన్​ ఫిల్మ్స్​ బ్యానర్​పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Salman Khan Mythri Movies
Salman Khan Mythri Movies

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 6:16 PM IST

Updated : Sep 25, 2023, 7:17 PM IST

Salman Khan Mythri Movies : బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్..​ తాజాగా తన సొంత బ్యానర్​పై ఓ సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాతో సల్మాన్ మేన కోడలు అలిజే అగ్నిహోత్రి తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆయన.. మైత్రీ మూవీస్​ మేకర్స్​తో సల్మాన్ ఖాన్​ ఫిల్మ్స్​ బ్యానర్​పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "నేను ఈ 'ఎఫ్' పదం గురించి మాట్లాడాను. మీరేం అనుకున్నారు. #FarreyTeaser ఈజ్​ అవుట్​ !" అంటూ సినిమాకు సంబంధించిన టీజర్​ అప్​డేట్​ను ఆయన నెట్టింట షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక సల్మాన్ సినిమాల విషయానికొస్తే..ఆయన లీడ్​ రోల్​లోటైగర్ 3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుంచి ఆయన రేంజ్​కు తగ్గ హిట్​ లేకపోవడం వల్ల సల్మాన్ ఫ్యాన్స్.. ఈ సినిమా గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా పక్కా ఇండస్ట్రీ అవుతుందంటూ ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక యశ్ రాజ్​ బ్యానర్​పై రూపొందుతున్న టైగర్ 3.. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న ఈ సినిమా టీజర్​ను రిలీజ్ చేయడానికి మూవీటీమ్​ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్​కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తున్నారు. అలాగే నటులు ఇమ్రాన్ హష్మి, విశాల్ జిత్వా, అభినవ్ రాజ్ సింగ్, అషుతోశ్ రానా తదితరులు కీలక పాత్రలు పోషి్స్తున్నారు.

సీఎం ఇంట్లో గణేశ్ సంబరాల్లో సల్మాన్.. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ముంబయిలోని తన ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్​తో పాటు బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ కూడా హాజరయ్యారు. అనంతరం వీరు పూజలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

సల్మాన్​ 'టైగర్‌ - 3' రిలీజ్‌ అప్పుడే

పిల్లలు కావాలి.. కానీ పెళ్లి మాత్రం వద్దు బాబోయ్​!: సల్మాన్​ ఖాన్​

Last Updated : Sep 25, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details