తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్ 'సలార్'​కు పోటీగా మరో సంచలన దర్శకుడి మూవీ కన్ఫామ్​.. సెన్సేషన్​​ అవుతుందా? - వ్యాక్సిన్ వార్ రిలీజ్ డేట్​

ప్రభాస్ 'సలార్​'కు పోటీగా అదే రోజు మరో సినిమా రిలీజ్​కు రెడీ అయింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు..

Salaar VS The Vaccine War
ప్రభాస్ 'సలార్'​కు పోటీగా మరో మూవీ.. ఆ దర్శకుడు పెద్ద సాహసమే చేస్తున్నారుగా!

By

Published : Aug 15, 2023, 4:00 PM IST

Salaar VS The Vaccine War : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సినిమా వస్తుందంటే ఎలాంటి సినిమా అయినా తప్పుకోవాల్సిందే. అదీ ప్రభాస్ రేంజ్​. మరి అలాంటి హీరోతో పోటీ పడేందుకు ఏ హీరో లేదా దర్శకుడు సాహసం చేయరు. కానీ ఇప్పుడా పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ఆయనకు పోటీగా కశ్మీర్​ ఫైల్స్​ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రానున్నారు.

Prabhas Salaar Release Date : ప్రస్తుతం ప్రభాస్ బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌' చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం.. పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​,పోస్టర్స్​ అభిమానులను విపరీతంగా సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమాకు 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ఫేమ్​ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'ది వ్యాక్సిన్‌ వార్‌' పోటీకి రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ వ్యాక్సిన్ వార్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్​. ప్రభాస్​ సలార్​కు పోటీగా సెప్టెంబర్​ 28న రాబోతున్నట్లు తెలిపారు.

Vaccine War Movie Release Date : ఓ వీడియో గ్లింప్స్​ను కూడా విడుదల చేశారు. ఇందులో పల్లవి జోషి, నానా పట్నేకర్ కనిపించారు. వ్యాక్సిన్ కోసం చేస్తున్న క్లీనికల్ ట్రయల్స్​ను వీడియోలో ఇంటెన్సివ్​గా చూపించారు. కరోనా బారిన పడుతున్న ప్రజలను కాపాడటానికి వ్యాక్సిన్​ను ఎలా కనిపెట్టారు? ఆ సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కున్నారు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? వంటి ఆసక్తికర అంశాలతో దీని రూపొందిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వ్యాక్సిన్ కోసం పడిగాపులు ఇలా ప్రతి అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారట. కశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్​పై ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 11 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇకపోతే గతంలో ఓ సారి ప్రభాస్‌ సినిమాతో వివేక్‌ అగ్నిహోత్రి సినిమా పోటీకి దిగి విజయం సాధించింది. 'రాధేశ్యామ్‌' మార్చి 11న రిలీజై డిజాస్టర్​ రిజల్ట్​ను అందుకోగా అదే రోజు వచ్చిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది.

పాపులారిటీ కోసమే పెళ్లిళ్లు.. 'కశ్మీర్​ ఫైల్స్'​ డైరెక్టర్ కామెంట్స్.. ఆమెను ఉద్దేశించేనా?

సుకుమార్​-వివేక్​ అగ్రిహోత్రి సడెన్​ సర్​ప్రైజ్​.. ఏంటో గెస్ చేయగలరా?

ABOUT THE AUTHOR

...view details