Salaar Vs Dunki Advance Booking :ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ఒక్కరోజు గ్యాప్‌లో 'సలార్', 'డంకీ' సినిమాలు రానున్నాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న ఈ సినిమాలకు విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తోపాటు భారత్‌లోనూ అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇమేజ్‌తో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్మడవుతున్నాయి. మరి దేశవ్యాప్తంగా ఆడ్వాన్స్ బుకింగ్స్‌లో ఏ సినిమా ఎంత కలెక్షన్లు చేసిందంటే?
సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ : 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారత్‌లో ఇప్పటివరకు రూ. 1.55 కోట్లు కలెక్షన్లు వసూల్ చేసింది. అందులో ఒక తెలుగులోనే ఏకంగా రూ. 1.1 కోట్లు రాగా, మలయాళంలో రూ. 35.3 లక్షలు, కన్నడలో రూ. 28.3 లక్షలు, తమిళలో రూ. 23.3 లక్షలు వసూలయ్యాయి. ఇక హిందీలో (రూ. 5.7 లక్షలు) ఓపెనింగ్ రోజు 350 షో లకుగాను 2303 టికెట్లు బుక్ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 75,817 టికెట్లు సోల్డ్ అయ్యాయి.
నార్త్ ఇండియా సేల్స్ స్టార్ట్ : 'సలార్' సినిమా బుకింగ్స్ నార్త్ ఇండియాలోనూ ఆదివారం (డిసెంబర్ 17) ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా తెలిపింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.