Salaar Part 2: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి, ప్రభాస్, పృథ్వీరాజ్ యాక్టింగ్‌కు యాక్షన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. దీంతో భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. మొత్తానికి డార్లింగ్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది అనే చెప్పాలి. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్ పడలేదు. అంతేకాకుండా అభిమానులు కోరుకున్న విధంగా కూడా ఏ సినిమా రాలేదు. దీంతో 'సలార్' సినిమా చూసిన అభిమాలు పండుగ చేసుకుంటున్నారు. వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ చూడగలుగుతున్నామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు.
ప్రభాస్ కటౌట్, ఇమేజ్‌కు తగ్గట్టుగా 'సలార్' సినిమాను రూపొందించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. స్టోరీ పరంగా అంతంత మాత్రంగా ఉందంటున్నప్పటికీ ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని ఫ్యాన్స్ అభిప్రాయపడున్నారు. దీంతో ఈ సినిమాకు మాస్ ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇంతవరకు ఓకే కానీ కొన్ని విషయాల్లో మాత్రం ప్రశాంత్ నీల్ మెప్పించలేకపోయారని అని అంటున్నారు. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగాలేదని, ఇద్దరి మిత్రుల మధ్య స్నేహం, పగ రెండు సరిగా చూపించలేకపోయారంటూ మూవీ లవర్స్ అంటున్నారు. ఇక స్టోరీని అయితే కొంచెం గందరగోళంగా నడిపించారని ఇలా చాలా విషయాల్లో కన్ఫ్యూజన్లో పెట్టేశారని టాక్ వినిపిస్తోంది.
అయితే వీటిన్నంటికి సమధానంగా 'సలార్' సెకండ్ పార్ట్ ఉంటుందంటూ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన జగపతిబాబు పాత్ర కూడా రెండో భాగంలో హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక 'శౌర్యాంగ పర్వం' అంటూ ఆసక్తకిరమై టైటిల్‌తో సెకండ్ పార్టను ప్రకటింటచారు డైరెక్టర్. ప్రాణ స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారారు అనే విషయంపైనే ఈ స్టోరీ నడవనుందని సమాచారం. దీంతో 'సలార్' ఫస్ట్ పార్ట్ కంటే రెండో భాగం ఇంకా బాగుంటుందంటూ విశ్లేషకులు అంటున్నారు. అలా అభిమానుల్లో ఈ పార్ట్ 2 మీద భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. పేరు కూడా వినేందుకు కొత్తగా ఉన్నందున ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.