తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సలార్‌'పై స్టార్‌ హీరో భార్య ఆసక్తికర కామెంట్స్.. ఏమందంటే! - పృథ్వి రాజ్​ భార్య సుప్రియా మీనన్

Salar Movie : క్రేజీ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్​ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సలార్‌'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

salaar movie
salaar movie

By

Published : Nov 20, 2022, 6:53 PM IST

Salar Movie : 'సలార్‌' సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై సినీ ప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న మలయాళ సూపర్‌ హీరో పృథ్వీరాజ్‌ భార్య సుప్రియా మేనన్‌ సలార్‌ సెట్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సలార్‌ సినిమా గురించి ఆమె చేసిన కామెంట్స్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

"సలార్‌ మూవీ రికార్డులను బ్రేక్‌ చేసేలా కనిపిస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను అంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇంత గొప్ప సృజనాత్మకత కలిగిన వ్యక్తుల పనితీరు దగ్గర నుంచి చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌, టీమ్‌ ఎంతో కష్టపడుతున్నారు. సలార్‌ సెట్స్‌ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉంది" అంటూ ప్రశాంత్‌ నీల్‌తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సలార్‌ సినిమా 5 భాషల్లో రూపుదిద్దుకుంటోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో సిద్దమవుతోన్న ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌తో పాటు 'ప్రాజెక్ట్‌ కె', ఆదిపురుష్‌ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి :'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్డేట్​.. 'బాస్​ పార్టీ'కి గెట్ రెడీ!

ప్రముఖ యువ నటి కన్నుమూత.. కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details