తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సలార్​'కు 'బాహుబలి' తరహా ట్విస్ట్ - ప్రశాంత్ నీల్ మాస్టర్​ ప్లాన్ ఇదే! - సలార్ ట్రైలర్

Salaar Baahubali Similarities : మరి కొద్దిగంటల్లో ప్రభాస్ 'సలార్' మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సలార్​కు 'బాహుబలి-1' లాంటి పోలిక ఒకటి ఉందంట అదేంటంటే?

Salaar Baahubali Similarities
Salaar Baahubali Similarities

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 5:20 PM IST

Salaar Baahubali Similarities : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​, డైరెక్టర్ ప్రశాంత్​ నీల్​ కాంబోలో తెరకెక్కిన 'సలార్' మరి కొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినిమా లవర్స్​ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాల్లో దీనికే అత్యంత హైప్​ ఉండటం వల్ల ఈ మూవీని ఎలాగైనా ఫస్ట్​డే చూడాలంటూ అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు. దీంతో అడ్వాస్​ బుకింగ్స్​కు విపరీతమైన డిమాండ్​ పెరిగిపోయింది. దీన్ని చూస్తున్న ఫ్యాన్స్ 'బాహుబలి' రోజులే గుర్తొస్తున్నాయంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయంలోనే కాదు ఈ సినిమాకు ఇంకొన్ని విషయాల్లోనూ 'బాహుబలి'తో పోలికలు ఉన్నాయి. అవేంటంటే

'సలార్​' కూడా రెండు భాగాలుగా వస్తుంది. అయితే 'బాహుబలి-1'కు ముగింపు ఇచ్చినట్టే 'సలార్'​ మొదటి భాగం ఉంటుందని తెలిసింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా డెరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఇచ్చిన హైప్ ​లాగానే ఉంటుందని అన్నారు. సినిమాలో మేజర్ హైలైట్ ఏంటి అని 'సలార్' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. క్లైమాక్స్​లో ఉండే ట్విస్ట్​ 'సలార్​-2' చూడాలా వద్దా, ఎందుకు చూడాలి అనేది డిసైడ్​ చేస్తుందంటూ ప్రశాంత్ వివరించారు. మరి 'బాహుబలి' లాగా అంతే రేంజ్​లో సక్సెస్​ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి మరీ.

సలార్​ టార్గెట్స్
Salaar Pre Release Business: మరోవైపు ఈ సినిమాకు బిజినెస్​ కూడా ఒక రేంజ్​లో జరిగింది. 'బాహుబలి'ని మించి వివిధ ఏరియాల్లో ఈ టికెట్​ రేట్లు పలకడం విశేషం. వరల్డ్ వైడ్​గా ఈ సినిమాకు రూ. 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అయితే ఈ సినిమాపై భారీగానే హైప్​ ఉన్నాయి. దీంతో ఒక వారం పాటు నిలకడగా భారీ వసూలు సాధిస్తే తప్ప అనుకున్న టార్గెట్లను అందుకోవడం కష్టమని ట్రేడ్ వర్గాల మాట.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.150 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇంకా ఈ సినిమాకు రూ.250 కోట్లు మేర గ్రాస్ వసూళ్లు చేయాలి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ. 65 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే రూ.100 కోట్లు దాటాలి. ఆంధ్రలో రూ.62 కోట్లు వచ్చాయి. సీడెడ్​ హక్కులు రూ.24 కోట్లు పలికాయి. ఇక సౌత్​ ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో రూ.50 కోట్ల బిజినెస్ జరిగింది. హిందీ వర్షన్ హక్కులు రూ.75 కోట్లు, ఓవర్సిస్​ రైట్స్​లో మరో రూ.75 లక్షలు వచ్చాయి. టార్గెట్​ను అందుకోవాలంటే సలార్​ ఫుల్​ రన్​లో రూ.600 కోట్ల మేర గ్రాస్​ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం.

15ఏళ్ల క్రితమే స్టోరీ లైన్​- 1000మందితో 'దేవ' ఫైట్​- ప్రభాస్, శ్రుతి సాంగ్​- సలార్​ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్​ ఇవే!

అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' తగ్గేదేలే- ఓపెనింగ్స్​ రూ.150కోట్లు పక్కా!

ABOUT THE AUTHOR

...view details