తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

RRR సంచలనం.. 'నాటు నాటు'కు ఆస్కార్​ నామినేషన్​ - undefined

rrr natu natu song got nomination in oscar awards 2023
rrr natu natu song got nomination in oscar awards 2023

By

Published : Jan 24, 2023, 7:16 PM IST

Updated : Jan 24, 2023, 7:40 PM IST

19:13 January 24

RRR సంచలనం.. ఆస్కార్​ నామినేషన్​ దక్కించుకున్న నాటు నాటు

'ఆర్​ఆర్​ఆర్​'తో భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల్లో నామినేట్​ అయింది. తెలుగు దిగ్గజ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి సృష్టించిన అద్భత దృశ్య కళాఖండం 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా నుంచి ఒరిజినల్​ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాట ఆస్కార్​ నామినేషన్లలో నిలిచింది. మ్యూజిక్​ మాంత్రికుడు ఎమ్​ఎమ్ కీరవాణి అందించిన​ స్వరాలకు.. సినీ కవి చంద్రబోస్​ సాహిత్యం సమకూర్చారు. రాహుల్​ సిప్లిగంజ్​, కాల భైరవ పాడారు. ఈ పాటతో పాటు అప్లాజ్​, హోల్డ్​ మై హ్యాండ్​, లిఫ్ట్​ మీ అప్​, దిస్​ ఈజ్​ ఏ లైఫ్​ అనే పాటలు నామినేషన్లో నిలిచాయి.

అప్రతిహతంగా అవార్డుల పరంపర..
ఆర్​ఆర్​ఆర్​ సినిమా అంచనాలకు మించి అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్​ఆర్​.. ఇప్పుడు ఆస్కార్​ రేసులో నిలిచింది. ప్రపంచంలోని దగ్గజ సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్​ కామెరూన్ లాంటి వారు విశ్లేషించే స్థాయికి భారత సినిమా చేరుకుందంటే.. అది ఆర్​ఆర్ఆర్​ వళ్లనే.

Last Updated : Jan 24, 2023, 7:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details