RRR Etthara Jenda Full Video Song Released: వారానికో ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ సినీ అభిమానుల్ని అలరిస్తోంది 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బృందం. ఇప్పటికే 'నాటు నాటు', 'కొమ్మా ఉయ్యాలా', 'దోస్తీ' వీడియోలు పంచుకున్న టీమ్ తాజాగా సెలబ్రేషన్ ఏంథమ్ 'ఎత్తర జెండా'ను అభిమానులకు అందించింది. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసినా అందులో కథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్, కథానాయిక అలియా భట్ మాత్రమే కనిపించారు.
ఈ కొత్త వీడియోలో దర్శకుడు రాజమౌళి, అజయ్‌దేవ్‌గణ్, ఒలివియా మోరిస్ తళుక్కున మెరిశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, ఎం. ఎం. కీరవాణి సంగీతం, విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హరికా నారాయణ్ గానం ఎంతగా అలరించాయో తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, రికార్డు సృష్టించింది.
Kalvathi Song New Record: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా.. విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'కళావతి' సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యంత వేగంగా 100మిలియన్ వీక్షణలతో అరుదైన ఘనత సాధించిన ఈ పాట తాజాగా 150 మిలియన్ వ్యూస్‌తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకొంది. విడుదలైన నాటి నుంచి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లు ఉన్న ఈ 'కళావతి' ఈ సంవత్సరంలోని పాటలన్నింటిలో మెలోడీ సాంగ్‌గా ముద్ర వేసుకొంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఈ పాటకు ఇప్పటి వరకు 1.9మిలియన్ల లైక్స్ వచ్చాయి. మహేశ్ బాబు సింపుల్ మూమెంట్స్‌తో, క్లాసీలుక్స్‌తో అలరించిన ఈ పాట ఆడియో స్ట్రీమింగ్ వేదికలన్నింటిలో అగ్రస్థానంలో నిలిచింది. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్‌కు సిద్ శ్రీరామ్ గొంతుకు సంగీతాభిమానులు ముగ్ధులయ్యారు.
ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన పెన్నీ, టైటిల్ ట్రాక్‌లు కూడా మంచి ప్రేక్షకాదరణతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలోని మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయాలని ఈ చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.