RRR EttaraJenda Dance By Japan People: తెలుగు పాటలంటే తమకు ఎంత ఇష్టమో ఇప్పటికే పలు సందర్భాల్లో జపాన్‌కు చెందిన కొందరు యువకులు తెలియజేశారు. ఉర్రూతలూగించే, డ్యాన్స్‌కు అధిక ప్రాధాన్యమున్న గీతాలకు వారు ఆనందించడమే కాదు బీట్‌కు తగ్గ స్టెప్పులూ వేస్తుంటారు. సంబంధిత వీడియోలను యూట్యూబ్ వేదికగా యావత్ సినీ అభిమానులతో పంచుకుంటుంటారు. అలా తమ ప్రతిభతో ఎందరితోనూ వావ్ అనిపించుకున్న హిరోమునియేర్, అసహి ససాకి అనే ద్వయం ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' లోని 'ఎత్తర జెండా' పాటతో అదరగొడుతున్నారు. వీరి సోదరుడూ ఇందులో భాగమయ్యాడు.
చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ఏ ఫ్రేమ్‌లో ఎలాంటి దుస్తులు ధరించారో అలాంటి వాటినే ధరించి, వారు ఎలాంటి స్టెప్పులేశారో అచ్చు గుద్దినట్టు అలానే వేసి నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఒరిజినల్ వీడియోలో కనిపించిన ప్రతి చిన్న వస్తువు మిస్ అవ్వకుండా తమకున్నంత బడ్జెట్‌లోనే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఫొటోలతో సహా అన్నింటినీ కవర్ చేశారు. వీరి సృజనాత్మకత, నృత్య ప్రతిభపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం జపాన్ 'చరణ్', 'తారక్', 'అలియా భట్'లు చేసిన 'ఎత్తర జెండా' కవర్ సాంగ్‌తోపాటు మరికొన్ని వీడియోలను చూసేయండి..