ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా 'కాంతార'. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కర్ణాటక తుళునాడులోని ఆచారాలను ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించారు. భూతకోల సంస్కృతిని తెలియజేశారు. ఇక, దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు 'ఓ..' అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఈ సినిమాలో చూపించారు. ఆ ధ్వని వినిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా.. 'ఓ' అంటూ కేకలు వేస్తూ.. సినిమాపై తమ అభిమానాన్ని బయటపెడుతున్నారు.
ప్రేక్షకులకు కాంతార హీరో రిక్వెస్ట్.. అలా చేయొద్దని - kantara rishab shetty
ఇటీవలే విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతున్న కాంతార సినిమా హీరో, దర్శకుడైన రిషభ్ శెట్టి ప్రేక్షకులకు ఓ రిక్వెస్ట్ చేశారు. అలా చేయొద్దని కోరారు. ఏంటంటే?
ప్రేక్షకులకు కాంతార హీరో రిక్వెస్ట్
ఈవిషయంపై తాజాగా నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. 'ఓ..' అనేది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు ఓ సెంటిమెంట్ అని అన్నారు. "కాంతార వీక్షించిన ప్రేక్షకులందరికీ నా చిరు విన్నపం. సినిమాలో ఉపయోగించిన శబ్దాలను అనుకరించొద్దు. ఇదొక ఆచారం, ఆధ్యాత్మిక నమ్మకం. అలాగే ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఆచారం దెబ్బతినొచ్చు" అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న టాప్ 10 దక్షిణాది చిత్రాలు ఇవే