'పుష్ప' సినిమాతో అనతికాలంలోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం 'వారసుడు' సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా 'పుష్ప' సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్న రష్మిక తన బిజీ షెడ్యూల్‌ను పక్కనబెట్టి ట్విట్టర్ వేదికగా రష్ అవర్ అంటూ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.
'పుష్ప' సినిమాలోని హీరో, హీరోయిన్లతో పాటు అందులలోని డైలాగ్స్, సాంగ్స్ కూడా ప్రపంచవ్యప్తంగా బాగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులోని 'సామి సామి' సాంగ్ అయితే థియేటర్లలోనే అభిమానుల చేత స్టెప్పులేయించింది. ఇప్పటికీ రీల్స్, డీజే.. ఎటు చూసినా ఇదే సాంగ్ మారుమోగిపోతోంది. అయితే ఆన్‌లైన్‌లో జరిగిన ఈ చిట్ చాట్‌లో ఓ అభిమాని తనకు రష్మికతో 'సామి సామి' పాటకు డాన్స్ చేయాలని ఉందంటూ కోరాడు. అయితే ఆ మాటకు రష్మిక ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. "నేను ఇప్పటికే 'సామీ సామీ' స్టెప్‌ను చాలా సార్లు వేశాను. ఇక నాకు వయసయ్యాక బ్యాక్ పెయిన్ వస్తుందని భావిస్తున్నాను. మీరెందుకు ఇలా నన్ను అడుగుతున్నారు. మనం కలిసినప్పుడు ఇంకేదైనా చేద్దాం" అంటూ క్యూట్‌గా రిప్లై ఇచ్చింది.