Rashmika Animal Pre Release Event : నేషనల్ క్రష్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం 'యానిమల్' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. మూవీ టీమ్‌తో కలిసి సందడి చేసిన ఆమె.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందులో భాగంగా డీఫ్ ఫేక్‌పై రష్మిక స్పందించారు. కానీ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి.. అమ్మాయిలకు ఒ సలహా ఇచ్చారు.
" ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు చాలా కామన్ అయిపోయాయి. అలాంటివి బయటకు వచ్చినప్పుడు మనం కచ్చితంగా స్పందించాలి. నాకు మొదట అమితాబ్ బచ్చన్ సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. మొదట్లో ఆ వీడియోను చూసి నేను చాలా బాధపడ్డాను. చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. మనం ఏం చేయగలం అనిపించింది. దీన్ని సాధారణంగా తీసుకోకూడదని అనుకున్నాను. అందుకే ఈ విషయంపై స్పందించాను. అమ్మాయిలందరికీ నేను ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే.. మీరు అస్సలు సైలెంట్‌గా ఉండొద్దు. కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల సపోర్ట్ లభిస్తుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నాం" అని రష్మిక అన్నారు.