తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జబర్దస్త్​ కొత్త యాంకర్​పై రష్మి కామెంట్స్​.. అలాంటి అభిప్రాయం​ లేదంటా! - నటి రష్మి బొమ్మబ్లాస్టర్​ సినిమా

జబర్దస్త్ కొత్త యాంకర్​ సౌమ్యరావుపై కామెంట్స్​ చేసింది నటి రష్మి. ప్రస్తుతం ఆ కామెంట్స్​ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రష్మి ఏం చెప్పిందంటే..

Rashmi comments on Jabardast new anchor Sowmya rao
జబర్దస్త్​ కొత్త యాంకర్​పై రష్మి కామెంట్స్​

By

Published : Nov 10, 2022, 9:38 AM IST

Updated : Nov 10, 2022, 10:07 AM IST

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్​. అయితే ఈ షోకు ఇటీవలే సౌమ్య రావు అనే కొత్త యాంకర్​ వచ్చింది. గతంలో జబర్దస్త్​కు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్​కు రష్మి గౌతమ్ యాంకర్స్​గా ఉండగా.. అనసూయ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆ షోకు కొత్త యాంకర్ వస్తోందంటూ రకరకాల యాంకర్ల పేర్లు వినిపించాయి. అయితే ఊహించని విధంగా రష్మి గౌతమే యాంకర్​గా వ్యవహరించింది. అయితే ఇటీవలే ఆ షోకు సౌమ్య రావుని తీసుకున్నారు. అయితే తనను తీసేసి కొత్త యాంకర్​ను తీసుకోవడంపై రష్మి సీరియస్​గా ఉందంటూ కథనాలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై రష్మి స్పందించింది.

"సౌమ్య రావుపై నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. తను రావడాన్ని స్వాగతిస్తున్నా. మల్లెమాల సంస్థ తను వస్తుందని నాకు ముందే చెప్పింది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళినప్పుడే.. నన్ను కొన్ని రోజులు మాత్రమే యాంకర్​గా వ్యవహరించమని చెప్పింది. మల్లెమాల నా సొంత సంస్థ లాంటిది. ఒకవేళ సౌమ్య వేరే షోస్​తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్ళీ వెళ్తాను. హ్యాపీగా షో చేసుకుంటాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా నేను సిద్ధమే" అని రష్మి వెల్లడించింది.

Last Updated : Nov 10, 2022, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details