తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'విరాటపర్వం'లో హీరో నేను కాదు.. రానా సంచలన వ్యాఖ్యలు - విరాట పర్వం

Rana Daggubati Sai Pallavi: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమా ట్రైలర్​ లాంచ్ కార్యక్రమం కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో హీరో తాను కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు రానా. ఆయన అలా ఎందుకు అన్నారో తెలుసుకుందాం.

rana daggubati sai pallavi
virata parvam

By

Published : Jun 6, 2022, 5:41 PM IST

'విరాట పర్వం' ట్రైలర్​ లాంచ్ ఈవెంట్​లో రానా, సాయి పల్లవి

Rana Daggubati Sai Pallavi: 'విరాట పర్వం' సినిమాలో సినిమాలో హీరో సాయి పల్లవి అని అన్నారు నటుడు రానా దగ్గుబాటి. ఈ కథ ఆమెదే అని చెప్పారు. కర్నూలులో నిర్వహించిన సినిమా ట్రైలర్​ లాంచ్ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు.

"దర్శకుడు వేణు.. చాలా నిజాయతీగా తన జీవితంలో చూసిన సంఘటనల ఆధారంగా.. అద్భుతమైన సినిమా చేశారు. అదే విరాట పర్వం. ఈ సినిమాలో హీరో సాయి పల్లవినే. ఇది ఆమె కథ."

-రానా దగ్గుబాటి, నటుడు

వారందరికీ క్షమాపణలు:గాలి, వాన కారణంగా కార్యక్రమానికి ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రేక్షకులకు క్షమాపణ తెలిపారు సాయి పల్లలి. "వాన, గాలి వస్తున్నా.. వేడుకలో ఇప్పటివరకు ఉన్నవారందరికీ ధన్యవాదాలు. మేమందరం మళ్లీ వస్తాం. ఎందుకంటే చాలామంది వచ్చి.. వానొస్తుందని వెళ్లిపోయారు. వారందరికీ క్షమాపణ చెబుతున్నాం. 'విరాటపర్వం' లాంటి కథ వస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక కథ తెలుగులోనే పుడుతుంది. మన భాష, మన ఊరు గురించి అంత బాగా రాసిన దర్శకుడు వేణుకు కృతజ్ఞతలు" అని సాయి పల్లవి తెలిపారు.

సాయి పల్లవి

సాయి పల్లవికి గొడుగు పట్టిన రానా:"ఒక పెద్ద మనసున్న వాళ్లు అన్నీ వాళ్లే చేయాలని అనుకోరు. వాళ్లు వెనక ఉండి.. ఇతరులకు సపోర్ట్ చేస్తారు. అలాంటివాడే రానా. రానానే అన్నీ చేసేయాలని అనుకోకుండా.. ఎంతో సహకారం అందించారు. ఆయనకు రుణపడి ఉంటాం." అని సాయి పల్లవి చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతుండగా జల్లు పడడం వల్ల ఆమెకు గొడుగు పట్టి అందరి ఆశ్చర్యపరిచారు రానా.

సాయి పల్లవికి గొడుగు పట్టిన రానా

తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్‌ ఉద్యమాల స్ఫూర్తితో రూపొందిన 'విరాటపర్వం' చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ప్రియమణి, నవీన్‌చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. కామ్రేడ్‌ రవన్నగా రానా.. వెన్నెలగా సాయి పల్లవి కనిపించనున్నారు. జూన్‌ 17న ఈ సినిమా విడుదలకాబోతుంది.

ఇదీ చూడండి:బాలయ్యకు విలన్​గా ప్రముఖ హీరోయిన్.. శివకార్తికేయన్​కు జోడీగా కియారా!

ABOUT THE AUTHOR

...view details