పాత్ర ఏదైనా అందుకు తగ్గట్టు ఆహార్యాన్ని మార్చుకోవడంలో ముందుంటారు మన కథనాయకులు. వారిలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఒకరు. పాత్రలు సవాలు విసిరితే దాన్ని స్వీకరించి, అభిమానులను అలరిస్తుంటారు. ఇప్పటికే 'ధృవ', 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలతో తన బాడీ లుక్స్‌ను మార్చి విశేషంగా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు కొత్త చిత్రం ఆర్‌సీ 15 కోసం నిర్విరామంగా కసరత్తులు చేస్తున్నారు. సంబంధిత వీడియోను చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది క్షణాల్లోనే లక్షల లైక్స్ సొంతం చేసుకుంది.
అందులో.. ఓ శిక్షకుడి పర్యవేక్షణలో బరువులు ఎత్తుతూ, ఫుట్‌బాల్ ఆడుతూ, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ కనిపించారు చరణ్. 'తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు అంతా సిద్ధం. వర్కౌట్‌కి వెకేషన్ లేదు' అని క్యాప్షన్ జోడించారు. 'డెడికేషన్ అంటే ఇది', 'సూపర్ అన్నా', 'లుక్ బాగుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.