ముంబయిలో సెలబ్రిటీలతో వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండే ప్రాంతం జుహు. ఇది చాలా ఖరీదైన ఏరియా కూడా. ఇక్కడ ఇల్లు ఉండటాన్ని ఒక స్టేటస్‌గా భావిస్తారు బాలీవుడ్ తారలు. అందుకే ఖర్చుకు వెనకాడకుండా జుహు ప్రాంతంలో ఇల్లు కొనడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. తాజాగా అక్కడ ఇల్లు ఉన్న వారిలో జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరో రాజ్‌కుమార్ రావ్ కూడా చేరిపోయారు. ఇటీవల ఆయన ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడట.
ఇంటి కోసం రాజ్‌కుమార్ రావ్ రూ. 44 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ ఇంటిని.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నుంచి కొనుగోలు చేశాడు రాజ్‌కుమార్ రావ్. అయితే ఇదే ఇంటిని 2020లో జాన్వీ రూ.39 కోట్లకు కొనుగోలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచింది. జులై 21 ఈ ఇంటి కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరగ్గా.. రాజ్‌కుమార్ రూ. 2.19 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించాడు. ఇదే ఇంటి కోసం జాన్వీ 2020లో స్టాంప్ డ్యూటీ కోసం రూ.78 లక్షలు చెల్లించింది.