తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సెట్స్​పైకి నయనతార నయా మూవీ.. ఇన్నేళ్ల తర్వాత హిట్‌ జోడీ రిపీట్‌ - నీలేష్ కృష్ణ నయనతార జై కొత్త సినిమా

ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో తమిళ అగ్రకథానాయిక నయనతార హీరోయిన్​గా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్​ కూడా ప్రారంభమైంది. అలాగే ఈ సినిమాలో పదేళ్ల క్రితం ఓ హిట్​ మూవీలో నటించిన జోడీయే రిపీట్​ కానుంది. ఆ వివరాలు.

Nayanathaara Jai New Movie
హీరోయిన్ నయనతార హీరో జై కొత్త సినిమా

By

Published : Apr 9, 2023, 1:17 PM IST

తమిళ అగ్రకథానాయికల్లో ఒకరిగా వెలుగొందుతున్న టాప్ హీరోయిన్​ నయనతార తాజాగా తన కొత్త చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ​లో పాల్గొన్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్​ను గ్రాండ్​గా ఆరంభించారు మేకర్స్. అంతేకాకుండా ఈ సినిమా స్పెషల్​ ఏంటంటే ఎప్పుడో 2013లో విడుదలైన రాజా రాణి చిత్రంలో జతకట్టిన జోడీయే మళ్లీ ఈ సినిమాలో అలరించనుంది. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్​ను నమోదు చేసుకుంది. దీంతో 10 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడం వల్ల ప్రేక్షకులు ఈ కొత్త మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళ చిత్రసీమలో నయనతార టాప్​ హీరోయిన్​గా దూసుకుపోతున్నారు. అంతేకాదు దక్షినాదిలో అత్యధిక రెమ్యునిరేషన్​ తీసుకుంటున్న నటీమణుల లిస్ట్​లో మొదిట స్థానంలో ఉన్నారు నయన్​.

ఇక చెప్పుకోవాల్సింది.. లేడీ ఓరియెంటెడ్​ సినిమాల గురించి. ఈ తరహా సినిమాలు తీయాలంటే ముందుగా నయనతారనే గుర్తుకు వస్తున్నారట అక్కడి దర్శకనిర్మాతలకు. అంతలా ఓ పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు నయన్​. దీంతో విమెన్​ ఓరియెంటెడ్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​గా మారారు ఈ తమిళ భామ. ఇది పక్కన పెడితే ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన నయన్‌.. గత కొంతకాలంగా ఈమె నటించిన సినిమాలు వరుస ఫ్లాప్​లుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు గతేడాది జూన్​లోనే తమిళ సినిమా దర్శకుడు, నటుడు విఘ్నేశ్​ శివన్​ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా​ పండంటి కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు నయన్​. దీంతో ఈమె​ సినీ కెరీర్​ ట్రాక్​ కాస్త స్లో అయింది.

నయన్​@75!
అయితే ఫలితాలు ఎలా ఉన్నా నయన్​ మాత్రం గ్యాప్​ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమా ప్రాజెక్టులున్నాయి. అందులోనిదే తాజాగా ప్రారంభమైన సినిమా షూటింగ్​. కాగా, నయన్​కు ఇది తన 75వ చిత్రం. దీనిని తమిళ ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తిరిగి సెట్స్​పైకి వచ్చిన నయనతారకు చిత్రబృందం గ్రాండ్‌గా వెలకమ్‌ చెప్పింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్​ మీడియాలో కూడా షేర్ చేసింది. కాగా, ఈ సినిమాలో నయన్​కు జంటగా హీరో జై నటిస్తున్నారు. దాదాపు పదేళ్ల కిందట రాజా రాణి సినిమాలో స్క్రీన్​ పంచుకున్న వీరిద్దరు మరోసారి జోడీగా అలరించనున్నారు.

మ్యూజిక్​ విషయానికొస్తే ఎస్​ఎస్​ థమన్​ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఇటీవలే నయన్​ నటించిన 'కనెక్ట్​' మూవీ విడుదలై ఘోరమైన ఫ్లాప్​ టాక్​ను మూటగట్టుకుంది. మూవీ క్రియేషన్స్​ బ్యానర్​ తెలుగులో ఇదే పేరుతో రిలీజ్​ చేసింది. ఇక్కడ కూడా బిగ్​ డిజాస్టర్​గా నిలిచి టాలీవుడ్​ ఆడియన్స్​కు కూడా 'కనెక్ట్​' కాలేకపోయింది. ప్రస్తుతం నయన్‌ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​తో కలిసి 'జవాన్‌' అనే సినిమాలో నటిస్తున్నారు. అట్లి డైరెక్షన్​లో రానున్న ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ బ్యాక్​గ్రౌండ్​లో​ తెరకెక్కుతోంది. దీంతో పాటు 'ఇరైవన్‌' అనే తమిళ సినిమాలో కూడా యాక్ట్​ చేస్తున్నారు ఈ తమిళ భామ.

ABOUT THE AUTHOR

...view details