పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దిశాపటానీ మరో కీ రోల్ పోషిస్తోంది. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఇది రెండు భాగాలుగా రూపొందబోతోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చేలా కనిపిస్తోంది. శివరాత్రి తర్వాత విడుదల తేదీ ప్రకటించాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలుస్తోంది. 2024 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. రిలీజ్ డేట్ రోజే ఈ సినిమా రెండు భాగాలా లేదా ఒక భాగమా అన్నది కూడా స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.