తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంతపై నిర్మాత షాకింగ్ కామెంట్స్​!.. రష్మికతో డీల్​కు గ్రీన్​సిగ్నల్​! - సమంతపై ఎస్​ఆర్ ప్రభు షాకింగ్ కామెంట్స్​

హీరోయిన్​ రష్మిక ప్రకటించిన కొత్త సినిమాలో ఫస్ట్​ ఛాయిస్​ సమంత అని తెలిసింది. అయితే ఈ విషయం గురించి.. రష్మిక కొత్త సినిమా నిర్మాత మాట్లాడుతూ.. సామ్​పై షాకింగ్ కామెంట్స్​ చేశారట! ప్రస్తుతం ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Samantha Rashmika
సమంతపై నిర్మాత షాకింగ్ కామెంట్స్​!.. రష్మికతో డీల్​కు గ్రీన్​సిగ్నల్​!

By

Published : Apr 4, 2023, 9:56 AM IST

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది. అదే సమయంలో మరో కథనాయిక కూడా వరుసగా భిన్న చిత్రాలను చేస్తూ కెరీర్​ను రాణిస్తోంది. నేషనల్​ వైడ్​గా ఇద్దరి స్టార్ డమ్​ ప్రస్తుతం పీక్స్​లో ఉందనే చెప్పాలి. అయితే తాజాగా రష్మిక.. డ్రీమ్​ వారియర్స్ పిక్చర్స్​ బ్యానర్​పై ఓ లేడీ ఓరింయెంటెడ్​ బైలింగ్వల్​ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిక్షనల్ లవ్​ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్​ ఏప్రిల్​ 3న​ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా ఫస్ట్​ ఛాయిస్​ రష్మిక కాదట. హీరయిన్ సమంతనట. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి మధ్య జరిగిన డీల్​ను పక్కనపెట్టి మనసు మార్చుకున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పుడు రష్మికను ఎంపిక చేశారట.

వాస్తవానికి.. డ్రీమ్​ వారియర్స్​ పిక్చర్స్​.. గతంలో 2021లో హీరోయిన్ సమంతతో ఓ సినిమాను ప్రకటించింది. అయితే దాని గురించి ఇప్పుడు వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ అనూహ్యంగా ఆ బ్యానర్​ వారు తాజాగా రష్మికతో సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో దేవ్​ మోహన్​.. రష్మికకు జోడీగా నటించనున్నట్లు తెలిపారు. 'రెయిన్​ బో' టైటిల్​ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు శాంతరూబన్​ డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో సమంత స్థానంలో రష్మిక రావడంపై అభిమానుల్లో సర్వత్ర ఆసక్తి మొదలైంది. అసలు ఏం జరిగి ఉంటుంది అనే ఉత్సుకత నెలకొంది.

అయితే ఈ సినిమా షూటింగ్​ లాంఛ్​ కార్యక్రమంలోనూ.. ఇదే ప్రశ్న నిర్మాత ఎస్​ఆర్​ ప్రభుకు ఎదురైంది. అయితే దీనికి ఆయన షాకింగ్ ఆన్సర్​ ఇచ్చారట! దీంతో అందరూ ఆయన.. పరోక్షంగా హీరోయిన్​ సమంతను ఉద్దేశించి అన్నారని అనుకుంటున్నారు. ప్రభు మాట్లాడుతూ.. క్రియేటర్స్, స్క్రిప్ట్స్​.. రైట్‌ ప్లేస్‌లో రైట్‌ పర్సన్‌ను సెలెక్ట్ చేసుకుంటాయి. మేం అదే నమ్ముతాం. ఆ ఫ్లోను మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్‌, కర్మ అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు" అని అన్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు సమంత ఫ్యాన్స్​ను హర్ట్​ చేశాయట. అంటే ఈ స్క్రిప్ట్​కు సామ్​ రైట్‌ పర్సనా కాదా? అని ప్రశ్నిస్తున్నారు సమంత ఫ్యాన్స్. కర్మ అనే పదం ఉపయోగించడం సరికాదని అంటున్నారు.

ఇకపోతే సమంత ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిన సమయానికి.. కాస్త అటు ఇటుగా హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురై బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం వేరే షూటింగ్​లతో బిజీ అయిపోయింది. ఏదిఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త హాట్​టాపిక్​గా మారాయి. కాగా, ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది సామ్​. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. దీని తర్వాత విజయ్​ దేవరకొండ ఖుషి సినిమాతో రానుంది. హిందీలోనూ సిటాడెల్ వెబ్​సిరీస్ చేస్తోంది.

ఇదీ చూడండి:నటుడిగా మారిన 'కచ్చా బాదం' సింగర్​.. రెమ్యునరేషన్​ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details