తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​పై నిర్మాత బండ్లగణేశ్ ట్వీట్​.. అలా చేయాలంటూ.. - నిర్మాత బండ్లగణేశ్​ ట్వీట్​

Bandla Ganesh Pawankalyan: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్​పై నిర్మాత బండ్ల గణేశ్‌ ఓ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.

Bandlaganesh Pawankalyan
పవన్​పై నిర్మాత బండ్లగణేశ్ ట్వీట్​.. అలా చేయాలంటూ..Bharat

By

Published : Aug 6, 2022, 2:49 PM IST

Bandla Ganesh Pawankalyan: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేశ్‌ చిన్న విన్నపం చేశారు. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసే చిత్రాలతో పవన్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరారు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ 'గబ్బర్‌సింగ్‌' లొకేషన్‌లో దిగిన కొన్ని ఫొటోలను శనివారం గణేశ్‌ షేర్‌ చేశారు. "నా దైవ సమానులైన పవన్‌కల్యాణ్‌.. తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమాలు త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని ప్రేమిస్తూ.. మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్‌ బద్దలే" అని ఆయన రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్స్‌పై పవన్‌ ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు. "పవన్‌తో మీరు మళ్లీ సినిమా చేస్తున్నారా?" అని ప్రశ్నిస్తూ వరుస కామెంట్స్‌ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ నటించిన 'తీన్‌మార్‌', 'గబ్బర్‌సింగ్‌' చిత్రాలకు గణేశ్‌ నిర్మాతగా వ్యవహరించారు. పవన్‌-బండ్లన్న కాంబోలో వచ్చిన 'గబ్బర్‌సింగ్‌' సూపర్‌హిట్‌ అందుకుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్‌సింగ్‌'తోపాటు తమిళ చిత్రం ‘వినోదాయ సీతాం’ రీమేక్‌ ఉన్నాయి. రాజకీయాలతో బిజీగా ఉండటంతో వృత్తిపరమైన జీవితం నుంచి పవన్‌ చిన్న విరామం తీసుకున్నారు.

ఇదీ చూడండి: బింబిసార- సీతారామం బ్యూటీస్​ హెవీ వర్కౌట్స్​.. చెమటలు పట్టిస్తున్నారుగా!

ABOUT THE AUTHOR

...view details